MLA : నేటి తరానికి సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జీవితం ఆదర్శనీయం

by Sridhar Babu |
MLA : నేటి తరానికి సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జీవితం ఆదర్శనీయం
X

దిశ,సత్తుపల్లి : నేటి తరానికి సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జీవితం ఆదర్శనీయమని సత్తుపల్లి ఎమ్మెల్యే డాక్టర్ మట్ట రాగమయి దయానంద్ అన్నారు. పెనుబల్లి మండల కేంద్రంలో శనివారం సర్దార్ పాపన్న గౌడ్ విగ్రహావిష్కరణను సినీ హీరో సుమన్ తో కలిసి ఇవిష్కరించారు. ఆ సంఘం నాయకులు నరసింహారావు అధ్యక్షతన నిర్వహించిన సభలో ఆమె మాట్లాడుతూ సర్దార్ పాపన్న గౌడ్ నైజాం నవాబుకు వ్యతిరేకంగా పోరాడిన మహా వీరుడని అన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే సర్వాయి పాపన్న పోరాటాన్ని గుర్తించి జయంతి, వర్ధంతి కార్యక్రమాలను అధికారికంగా నిర్వహించటం చాలా సంతోషదాయకమని అన్నారు.

సినీ హీరో సుమన్ మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు చెందిన ప్రజలు రాజ్యాధికార దిశగా అడుగులు వేయాలని, ముఖ్యంగా గౌడ సామాజిక వర్గానికి చెందిన ప్రజలు చదువు పట్ల ఆసక్తి చూపకపోవటంతో ఆ సామాజిక వర్గం వెనుకబడి ఉన్నదని అన్నారు. రానున్న రోజుల్లో మరింత మంది ఉన్నత చదువులు చదివేందుకు ఆసక్తి కనపరచాలని ఆయన కోరారు. పాపన్న గౌడ్ విగ్రహావిష్కరణలో పాల్గొనడం చాలా సంతోషకరమని పేర్కొన్నారు. అనంతరం కమిటీ సభ్యులు సినీ హీరో సుమన్ ను, స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ మట్ట రాగమయి దయానందును శాలువతో ఘనంగా సన్మానించి జ్ఞాపికను అందజేశారు. ఈ కార్యక్రమంలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహావిష్కరణ కమిటీ సభ్యులు, పెనుబల్లి మార్కెట్ కమిటీ చైర్మన్ భాగం నీరజ, సత్తుపల్లి ఏఎంసీ చైర్మన్ దోమ ఆనంద్ బాబు, మున్సిపల్ వైస్ చైర్పర్సన్ తోట సుజలా రాణి, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, గౌడ సంఘం నాయకులు పాల్గొన్నారు.

Advertisement

Next Story