- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
India : అమెరికా అక్కసు.. 19 భారతీయ కంపెనీలపై ఆంక్షలు
దిశ, నేషనల్ బ్యూరో : రష్యా మిత్రదేశాలకు చెందిన 400కుపైగా కంపెనీలు/వ్యక్తులపై అమెరికా(US) ఆంక్షలను ప్రకటించింది. వీటిలో భారత్(India)కు చెందిన 19 కంపెనీలు కూడా ఉన్నాయి. చైనా, స్విట్జర్లాండ్, థాయ్‌లాండ్, టర్కీ, కజకిస్తాన్, యూఏఈలకు చెందిన పలు కంపెనీలపై సైతం అగ్రరాజ్యం ఆంక్షల కొరడా ఝుళిపించింది. రష్యా(Russia)కు కంప్యూటర్ న్యూమెరికల్ కంట్రోల్ సరుకులు, మైక్రో ఎలక్ట్రానిక్స్ వస్తువులను ఎగుమతి చేస్తున్న భారత కంపెనీలపై అమెరికా ఆంక్షలు విధించినట్లు తెలిసింది. రష్యా రక్షణశాఖకు చెందిన సీనియర్ అధికారులు, ఆ దేశపు రక్షణ రంగ కంపెనీలపైనా అమెరికా ఆంక్షలు విధించింది.
ఈ లిస్టులో రష్యా ఇంధన ఉత్పత్తి, ఎగుమతి కంపెనీలు కూడా ఉన్నాయని అమెరికా ఆర్థికశాఖ డిప్యూటీ సెక్రెటరీ వాలీ అడెయెమో తెలిపారు. ఉక్రెయిన్‌పై అక్రమంగా, అన్యాయంగా రష్యా దండయాత్ర చేస్తోందన్నారు. తమ మిత్రదేశాలకు అండగా నిలబడతామని ఆయన పేర్కొన్నారు. ఇక అమెరికా ఆంక్షలను భారత్ ఖండించింది. తాము రష్యాతో లీగల్‌గానే వాణిజ్యాన్ని కొనసాగిస్తున్నామని భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ వెల్లడించారు. న్యూక్లియర్, రసాయన ఆయుధాల తయారీని నిరోధించే కూటముల్లో భారత్ సభ్యదేశంగా ఉందని, వాటి నిబంధనలను పాటిస్తోందన్నారు. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి తీర్మానాలకు అనుగుణంగా భారత్ నడుచుకుంటోందని ఆయన తెలిపారు.