- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
పట్టు బిగించిన ఆసిస్‘ఏ’.. ఓటమి దిశగా భారత్‘ఏ’
దిశ, స్పోర్ట్స్ : ఆస్ట్రేలియా ‘ఏ’ జట్టుతో జరుగుతున్న తొలి అనధికార టెస్టులో భారత్ ‘ఏ’ జట్టు ఓటమి అంచున నిలిచింది. శనివారం ఆట ముగిసే సమయానికి ఆసిస్ ‘ఏ’ జట్టు విజయానికి 86 పరుగుల దూరంలో నిలిచింది. ఆ లోపు 7 వికెట్లు తీస్తేనే యువ భారత్ గెలుస్తుంది. ఓవర్‌నైట్ స్కోరు 208/2తో మూడో రోజు ఆట కొనసాగించిన భారత్ ‘ఏ’ జట్టు మరో 104 పరుగులే చేసింది.
ఓవర్‌నైట్ బ్యాటర్ సాయి సుదర్శన్(103) సెంచరీ పూర్తి చేసి అవుటవ్వగా.. అంతకుముందే పడిక్కల్(88) వెనుదిరిగాడు. వారు అవుటైన తర్వాత దూకుడు తగ్గింది. ఇషాన్ కిషన్(32), నితీశ్ రెడ్డి(17)సహా మిగతా బ్యాటర్లు నిరాశపరిచారు. 56 పరుగుల వ్యవధిలోనే ఐదు వికెట్లుపడ్డాయి. దీంతో రెండో ఇన్నింగ్స్‌లో 312 పరుగులు చేసి ఆలౌటైన భారత్ ‘ఏ’ జట్టు.. ప్రత్యర్థి ముందు 225 పరుగుల లక్ష్యం నిర్దేశించింది.
ఛేదనకు దిగిన ఆసిస్ ‘ఏ’ జట్టు మూడో రోజు ఆట ముగిసే సమయానికి 139/3 స్కోరు చేసింది. నాథన్ స్వీనీ(47 బ్యాటింగ్), వెబ్‌స్టర్(19 బ్యాటింగ్) క్రీజులో పాతుకపోయి జట్టును విజయం దిశగా నడిపిస్తున్నారు. ఆ జట్టు విజయం సాధించాలంటే ఇంకా 86 రన్స్ చేయాలి. భారత్ ‘ఏ’ గెలుపొందాలంటే 7 వికెట్లు తీయాలి. మ్యాచ్‌లో ఆదివారం ఆఖరి రోజు.