- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
దొంగతనాలకు పాల్పడుతున్న నలుగురు వ్యక్తులు అరెస్ట్..!
దిశ, వెల్దండ : నాగర్ కర్నూల్ జిల్లా పరిధిలోని ఆయా మండలాల్లో దొంగతనాలకు పాల్పడుతున్న దొంగలను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. వెల్దండ పోలీస్ స్టేషన్ సీఐ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో సీఐ విష్ణువర్ధన్ రెడ్డి వివరాలు వెల్లడించారు. జిల్లా ఎస్పీ గైక్వాడ్ వైభవ్ రఘునాథ్ ఆదేశాల మేరకు పండుగల నేపథ్యంలో వరుసగా దొంగతనం జరుగుతున్న క్రమంలో శనివారం వెల్దండ సర్కిల్ పరిధిలోని వంగూరు మండల పరిధిలోని శ్రీశైలం చౌరస్తా వద్ద వాహనాలను పోలీసులు తనిఖీలు జరిపారు. ఈ క్రమంలోనే ఎర్టిగా కారు ఆపగా అందులో నలుగురు అనుమానాస్పదంగా కనిపించారన్నారు. వారి వద్ద దొంగతనానికి పాల్పడడానికి కొన్ని వస్తువులు లభించాయి. వారిని అదుపులో తీసుకొని వెల్దండ సీఐ కార్యాలయానికి తీసుకొచ్చి విచారించగా, వారి వద్ద నుండి 9 తులాల బంగారం, 1.2 కిలోల వెండి, రూ . 50 వేల నగదు, ఒక రాడు, స్కూల్ డ్రైవర్, 2 మొబైల్స్, ఒక వాహనాన్ని సీజ్ చేసి కోర్టు ముందు హాజరు పరిచినట్లు వెల్దండ సీఐ విష్ణువర్ధన్ రెడ్డి తెలిపారు.
వికారాబాద్ జిల్లా బంట్వారం మండలం తోరుమామిడి గ్రామానికి చెందిన గుడల మాణిక్యం అలియాస్ మనీ (24) అనే పాత నేరస్థుడు ఉన్నారు. ఇతడు గతంలో బైకుల దొంగతనాలలో 15 కేసులు నమోదయినట్లు, ప్రస్తుతం తాళం వేసిన ఇల్లే టార్గెట్ గా దొంగతనాలకు పాల్పడినట్లు ఇతర వెంబడి బల్మూరు మండలం తుమ్మన్ పెట్ గ్రామానికి చెందిన చింత బాలరాజు అలియాస్ బాలు (24) ఇద్దరు స్నేహితులు, వీరితో పాటు మరో ఇద్దరు వ్యక్తులను కలుపుకొని నలుగురు ఈ దొంగతనాలకు పాల్పడినట్లు తెలిపారు. వంగూరు మండలం రంగాపూర్ గ్రామంలో, కల్వకుర్తి మండలం లింగసానిపల్లి గ్రామంలో, ఉప్పునుంతల మండలం జప్తి సదాగోడు గ్రామంలో దొంగతనాలు జరిపినట్లు ఒప్పుకున్నాడు.
వారి వద్ద నుండి 9 తులాల బంగారం, 1.2 కిలోల వెండి, రూ.50 వేలు నగదు మొత్తంగా రూ. 9 లక్షల 35 వేలు విలువ దొంగిలించినట్లు విచారణలో తేలిందన్నారు. అనంతరం దొంగిలించిన బంగారాన్ని అతడి నుంచి రికవరీ చేసి జిల్లా ఎస్పీ గైక్వాడ్ వైభవ రఘునాథ్, డీఎస్పీ కల్వకుర్తి ఆదేశాల మేరకు అరెస్టు చేసి రిమాండ్ కు తరలించినట్లు తెలిపారు. ఈ కేసులో వంగూరు ఎస్సై మహేందర్, వెల్దండ ఎస్సై కురుమూర్తి, కల్వకుర్తి ఎస్సై, చారగొండ ఎస్సై, పోలీస్ సిబ్బంది ఆంజనేయులు, ఆంజనేయులు, హరి, కిషోర్ రెడ్డి, రాంబాబు, యాదగిరి, డ్రైవర్ శ్రీనివాస్ రెడ్డి లు చాకచక్యంగా వ్యవహరించడంతో ఈ కేసును చేదించారు. పోలీస్ సిబ్బంది ఎస్పీ అభినందించినట్లు సీఐ విష్ణువర్ధన్ రెడ్డి తెలిపారు.