రాష్ట్రస్థాయి ఈత పోటీల్లో కొత్తగూడెం యువకుల ప్రతిభ

by Sridhar Babu |   ( Updated:2024-11-02 14:34:59.0  )
రాష్ట్రస్థాయి ఈత పోటీల్లో  కొత్తగూడెం యువకుల ప్రతిభ
X

దిశ, కొత్తగూడెం : స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో నిర్వహించే రాష్ట్రస్థాయి ఈత పోటీల్లో కొత్తగూడెం యువకులు ప్రతిభ చాటారు. శనివారం హైదరాబాద్​లోని జియాన్ స్పోర్ట్స్ అకాడమీలో నిర్వహించిన రాష్ట్ర స్థాయి ఈత పోటీల్లో కొత్తగూడెం యువకులు ఐదు పతకాలు సాధించారు. నవభారత్ పబ్లిక్ స్కూల్లో విద్యానభ్యసిస్తున్న కొట్టే సాయి శ్రీ వాత్సావ్ మూడు కాంస్య పతకాలు, బండారి నాగ చైతన్య రెండు కాంస్య పతకాలు సాధించారు.

సాయి శ్రీ వాత్సవ్ 50 మీటర్ల ఫ్రీ స్టయిల్, 50 మీటర్ల బ్రెస్ట్ స్ట్రోక్, 200 మీటర్ల బ్రెస్ట్ స్ట్రోక్ లో పతకాలు సాధించగా, నాగచైతన్య 400 మీటర్ల ఐఎం, 200 మీటర్ల ఫ్రీ స్టైల్ లో పతకాలు సాధించారు. నవభారత్ పబ్లిక్ స్కూల్ పాఠశాల ప్రిన్సిపాల్ ఎంవీరెడ్డి, స్విమ్మింగ్ కోచ్ లు హనుమంతరాజు, సామ్యూల్, సంధ్య సామంత్ విద్యార్థులను అభినందించారు.

Advertisement

Next Story