Karthika Deepam Serial Today November 2nd : నా కోసం అందరినీ వదలుకుంటారా .. అని కార్తీక్ ని ప్రశ్నించిన దీప?

by Prasanna |   ( Updated:2024-11-02 14:56:06.0  )
Karthika Deepam Serial Today November 2nd : నా కోసం అందరినీ వదలుకుంటారా .. అని కార్తీక్ ని ప్రశ్నించిన దీప?
X

దిశ, వెబ్ డెస్క్ : కార్తీక దీపం ఎపిసోడ్ లో ఈ సీన్ హైలెట్

" వాళ్లు మీ గురించి తప్పుగా మాట్లాడుకుంటారు. మిమ్మల్ని తక్కువగా చూడటానికి.. నేను కారణం కాకూడదని దీప " అంటుంది. అప్పుడు కార్తీక్ "దీప నువ్వు ఎవరో కాదు.. నా భార్యవి" అనగానే దీప " కాదు బాబు అది మీ దురదృష్టం." అని అంటుంది. కార్తీక్ "శౌర్య నా కూతురు" అనగానే దీప " దాని అదృష్టం అని " అంటుంది. " వీలైనంత తొందర్లోనే నీకు అన్ని అర్ధమవుతాయని కార్తీక్ " అనడంతో అప్పుడు దీప.. " అదేం అవసరంలేదు బాబూ.. మీరు మంచితనాన్ని మీరే పాడుచేసుకోకండి "అని కార్తీక్ అంటుంది. కార్తీక్ " నన్ను అర్థం చేసుకోలేనివాళ్ళు నాకు కూడా అవసరం లేదని " కార్తీక్ అంటాడు. "నా కోసం అందరిని వదులుకుంటారా.." అని దీప అడుగుతుంది.

"వదులుకోవడంలో అసలు తప్పు లేదని కార్తీక్ " అంటాడు. కానీ, "మీ త్యాగానికి నేను అర్హురాలిని కాదు" అని, "ని అర్హత నిర్ణయించేది నీ మెడలోనే ఉందని " కార్తీక్ అంటాడు. "ఇది నాకు నేనుగా ఎప్పుడూ కోరుకోలేదు"..అని దీప అనగా, కార్తీక్ "నువ్వు వద్దనుకుంటే సరిపోదుగా , నీకు నష్టంగా ఉందేమో.. కానీ, నాకు మాత్రం నేను చేసింది మంచి పని, మానవత్వంతో తీసుకున్న బాధ్యత అని కార్తీక్ అంటాడు. ఇక్కడితో ఈ సీన్ ముగుస్తుంది.



Read More ..

Brahmamudi November 2nd Episode : కావ్యకు సీరియస్ వార్నింగ్ ఇచ్చిన రాజ్

Advertisement

Next Story

Most Viewed