- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
US Presidential Elections: తమిళనాడులో కమలా హ్యారిస్ గెలవాలని ప్రత్యేక పూజలు
దిశ, నేషనల్ బ్యూరో: నవంబర్ 5వ తేదీన అమెరికా అధ్యక్ష(US Presidential Elections) ఎన్నికలు జరగనున్నాయి. కాగా.. డెమొక్రటిక్ అభ్యర్థి కమలా హ్యారిస్ ఎన్నికల్లో గెలవాలని భారత్ లో పూజలు జరుగుతున్నాయి. కమలా హ్యారిస్(Kamala Harris) పూర్వీకుల గ్రామం అయిన మన దేశంలోని తమిళనాడు(Tamil Nadu) రాష్ట్రంలోని తులసేంద్రపురంలో మాత్రం ఇప్పటికే సంబరాలు ప్రారంభం అయ్యాయి. తులసేంద్రపురం మొత్తం కమలా హారిస్ ఫ్లెక్సీలతో నిండిపోయింది. అంతేకాకుండా అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో కమలా గెలవాలని స్థానికులు ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో కమలా హారిస్ పోటీ చేయడం చారిత్రాత్మకమైనదని.. అది తమకు ఎంతో గర్వంగా ఉందని ఈ సందర్భంగా తులసేంద్రపురంవాసులు వెల్లడించారు.
కమలా నేపథ్యం
ఇకపోతే, కమలా హారిస్ తల్లి శ్యామలా గోపాలన్ భారతీయురాలు. శ్యామల తండ్రి గోపాలన్ తమిళనాడులోని తులసేంద్రపురంలో పుట్టారు. గోపాలన్ భారత ప్రభుత్వ అధికారిగా పలు హోదాల్లో పని చేశారు. కమలా హారిస్ తల్లి శ్యామల గోపాలన్.. 19 ఏళ్ల వయసులో ఉన్నపుడు పై చదువుల కోసం అమెరికాలోని కాలిఫోర్నియాకు వెళ్లారు. అక్కడ శ్యామలా గోపాలన్ రొమ్ము క్యాన్సర్‌పై అనేక పరిశోధనలు చేశారు. ఈ క్రమంలోనే జమైకాకు చెందిన డొనాల్డ్ హారిస్‌ను శ్యామల గోపాలన్ పెళ్లి చేసుకున్నారు. డొనాల్డ్ హారిస్, శ్యామల గోపాలన్‌లకు పుట్టిన తొలి బిడ్డనే కమలా హారిస్. తాను చిన్నతనంలో ఉన్నపుడు భారత్‌లోని తన అమ్మమ్మ, తాతయ్యలను కలిసినట్లు ఇటీవల కమలా హారిస్ ట్విటర్‌లో వెల్లడించారు. 2014లో కమలా బంధువులు.. ఆమె పేరు మీద తులసేంద్రపురంలోని 300 ఏళ్ల నాటి గుడికి భారీగా విరాళం ఇచ్చారు. ఆ గుడి శిలాఫలకాలపైనా కమలా పేరు చెక్కించారు. అంతేకాక, స్థానికంగా ఉన్న వాటర్ ట్యాంక్‌కు కమలా హ్యారిస్ పేరు పెట్టడం విశేషం. అంతేకాకుండా త్వరలో తులసేంద్రపురంలో నిర్మించే బస్‌స్టాండ్‌కు కూడా ఆమె పేరునే పెట్టాలని స్థానికులు నిర్ణయించుకున్నారు. గతంలో ఉపాధ్యక్ష పదవికి పోటీ పడినప్పుడు కూడా ఆమె గెలవాలని కోరుకుంటూ తులసేంద్రపురంవాసులు ప్రత్యేక పూజలు నిర్వహించారు.
Read More : Donald Trump: అధికారంలోకి వస్తే ఆర్థిక అద్భుతాలు చేస్తా- ట్రంప్