MP Kavya : మా నాన్నకు, నాకు రాజకీయ జీవితాన్ని ఇచ్చారు

by Kalyani |
MP Kavya : మా నాన్నకు, నాకు రాజకీయ జీవితాన్ని ఇచ్చారు
X

దిశ, లింగాలఘణపురం : పుట్టింది పర్వతగిరిలో అయితే మా నాన్నకు నాకు రాజకీయ జీవితాన్ని ఇచ్చింది మాత్రం స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గ ప్రజలని పార్లమెంటు సభ్యురాలు కడియం కావ్య అన్నారు. శనివారం మండలంలోని కళ్లెం, కుందారం, లింగాల ఘణపురం, నెల్లుట్ల గ్రామాలలో పిఎసిఎస్ ఐకేపీ ఆధ్వర్యంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ…రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాల ప్రజలు ఎక్కువగా ఉన్న నియోజకవర్గం స్టేషన్ ఘన్పూర్ అని, ఎమ్మెల్యే, ఎంపీ నిధులతో అభివృద్ధిలో డబుల్ ధమాకా గా చూపిస్తామన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం పై ప్రజలు పెట్టుకున్న నమ్మకాన్ని, నిలబెడతామన్నారు.

గత ప్రభుత్వం రూ.7 వేల కోట్లు అప్పును ప్రజల నెత్తిన భారం మోపిందని అన్నారు. అధికారం పోయిన బి ఆర్ ఎస్ నాయకులు మతిభ్రమించి మాట్లాడుతున్నారు అన్నారు. బిజెపి నాయకులు తెలంగాణ ప్రజలకు చేసింది ఏమీ లేదు కానీ, కాంగ్రెస్ ప్రభుత్వం పై తప్పుడు ప్రచారం చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నారన్నారు. రైతు చెమటోడ్చి పండించిన ప్రతి ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని, డిసెంబర్ 9 నాటికి రైతు రుణమాఫీ పూర్తి చేస్తుందన్నారు. రైతులు ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాల్లో విక్రయించి, ప్రభుత్వం సన్న వడ్ల కిస్తున్న 500 రూపాయల బోనసులు పొందాలన్నారు. మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతు సంక్షేమ లక్ష్యంగా పనిచేస్తున్నారన్నారు.

బిజెపి నాయకుల్లారా చౌకబార్ విమర్శలు మానండి..... కడియం

రాష్ట్ర అభివృద్ధి కోసం కేంద్రం నుంచి నిధులు తెచ్చే దమ్ము లేని బీజేపీ నాయకులు కాంగ్రెస్ ప్రభుత్వం పై చేస్తున్న చౌకబారు విమర్శలను మానుకోవాలని ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. భారతీయ జనతా పార్టీ నాయకులకు తెలంగాణ ప్రజలపై, ప్రేమ ఉంటే తెలంగాణ అభివృద్ధి చెందాలంటే నరేంద్ర మోడీని ఒప్పించి,కేంద్ర ప్రభుత్వం మెడలు వంచి 50 వేల కోట్ల గ్రాండ్ తెచ్చి తెలంగాణ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలన్నారు. ఒక పైసా ఇవ్వకుండా,ఒక ప్రాజెక్టు తీసుకురాకుండా, ఒక విశ్వవిద్యాలయం తీసుకురాకుండా విమర్శలు చేస్తే మాత్రం ప్రజలు చూస్తూ ఊరుకోరన్నారు.

బీఆర్ఎస్ నాయకులు అధికారం కోల్పోయి, జీర్ణించుకోలేక అక్కసుతో,అహంకారంతో ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారన్నారు. గత ప్రభుత్వం పదేళ్ల పాలనలో ప్రజల సొమ్మును, దోచుకుందే తప్ప చేసింది ఏమీ లేదన్నారు. అధికారంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది రాజకీయాలకు అతీతంగా మీ అందరి సహకారంతో నియోజక వర్గాన్ని అభివృద్ధి చేసుకుందామన్నారు. త్వరలోనే ఇందిరమ్మ ఇల్లు ప్రక్రియ ప్రారంభం అవుతుంది అన్నారు. యాసంగి వరకు మండలంలోని అన్ని గ్రామాల చెరువులు గోదావరి జలాలతో నింపుతానన్నారు. మండల కేంద్రంలోని గోదాములను త్వరలోనే మరమ్మత్తు చేయించి, ధాన్యం విక్రయించే వారికి ఇబ్బంది కలగకుండా సీసీ రోడ్లు వేయిస్తానని హామీ ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో ఆర్డీవో గోపి, జిల్లా వ్యవసాయ అధికారి రామారావు నాయక్, డి సి ఓ మురళి, మార్కెట్ వైస్ చైర్మన్ కొల్లూరి శివకుమార్, ఏవో వెంకటేశ్వర్లు, ఎంపీడీవో జలంధర్ రెడ్డి, మాజీ జెడ్పిటిసి గుడి వంశీధర్ రెడ్డి, మార్కెట్ డైరెక్టర్లు నీల మోహన్, శ్రీలత రెడ్డి, పిఎస్ సిఎస్ చైర్మన్లు శ్రీశైలం, ఉపేందర్, నాయకులు గుర్రం బాలరాజు, విజయ భాస్కర్, నాగరాజు, బత్తిని అశోక్, నాగేందర్, కృష్ణారెడ్డి, దూసరి గణపతి, బిట్ల బాబు, దిలీప్ రెడ్డి, సంపత్, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story