- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
illegal movement : అక్రమ రేషన్ తరలింపు ఆపేది ఎవరు...?
దిశ, బషీరాబాద్ : కొన్ని యేండ్ల తరబడి రేషన్ బియ్యంను అక్రమంగా సరిహద్దులు దాటిస్తున్నారు. ఈ అక్రమ దందా వెనకాల ఇరు శాఖల అధికారుల హస్తం ఉండటంతో అక్రమార్కుల వ్యాపారం మూడు పువ్వులు..ఆరు కాయలుగా కొనసాగుతోంది. వికారాబాద్ జిల్లాకు మారుమూల మండలం అయినా బషీరాబాద్ నుంచి కర్ణాటక రాష్ట్రానికి రేషన్ బియ్యం పెద్ద సంఖ్యలో రాత్రికి రాత్రి తరలివెళ్తుంది. రాత్రివేళల్లో విధులు నిర్వహిస్తున్న ఇరు శాఖల అధికారులతో అక్రమార్కులు చేయి కలిపి తమ వ్యాపారాలను యథేచ్చగా కొనసాగిస్తున్నారు. అక్రమ దందాను అడ్డుకోవాల్సిన అధికారులే అక్రమార్కలకు వత్తాసు పలకడం తో పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగేలా అధికారుల తీరు తలపిస్తుందని ప్రజలు చర్చించుకుంటున్నారు. రేషన్ బియ్యం అక్రమ తరలింపు వెనకాల రాజకీయ నాయకుల హస్తం కూడా ఉన్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.
తక్కువ ధరకు కొని :-
ఆహారం కొరత లేకుండా నీరు పేద ప్రజల కోసం ప్రభుత్వం డీలర్ల ద్వారా ప్రతి నెల రేషన్ బియ్యాన్ని అందిస్తోంది. ఇదే అదునుగా తీసుకున్న కేటు గాళ్ళు లబ్ధిదారుల నుంచి రేషన్ బియ్యం 15 రూపాయలకు కొని కర్ణాటకలో 35 రూపాయల నుంచి ౫౦ రూపాయల వరకు విక్రయిస్తూ దళారులు సొమ్ము చేసుకుంటున్నారు.ఇటు లబ్ధిదారులకు, అటు ప్రభుత్వ పథకానికి నష్టం కలిగిస్తూ అక్రమార్కులు గట్టేక్కుతున్నారు.
డీలర్ల చేతివాటం :-
రేషన్ బియ్యం పక్క రాష్ట్రాలకు తరలింపులో డీలర్లు సైతం రంగంలోకి దిగినట్లు ఆయా గ్రామాల్లో ప్రజల నుంచి పెద్దగా ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఒకప్పుడు చిరు వ్యాపారస్థులు బియ్యం కొని విక్రయించేవారు. ఇప్పుడు ఈ వ్యవహారం అంతా రేషన్ డీలర్ల ఆధ్వర్యంలోనే కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. ఈ రేషన్ దందా అంతా బషీరాబాద్ మండల సరిహద్దులలో ఉన్న గ్రామాల నుంచి కర్ణాటక రాష్ట్రానికి రేషన్ బియ్యం జోరుగా తరలిస్తున్నారు. ఈ వ్యవహారం అధికారులకు తెలిసిన చూసి చూడనట్టుగా వ్యవహరించడంతో అధికారులు భారీ మొత్తంలో ముడుపులు తీసుకొని వాటి వైపు దృష్టి సారించలేకపోతున్నారని విమర్శలు సైతం లేకపోలేవు.
సివిల్ సప్లై పై ఆరోపణలు :-
కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాల నుండి ప్రజలకు అందించే రేషన్ బియ్యం సివిల్ సప్లై అధికారుల ఆధ్వర్యంలో డీలర్లకు చేరుతుంది. అయితే సివిల్ సప్లై అధికారులు రేషన్ షాపులలో లబ్ధిదారుల జాబితాను బట్టి ఏ షాపునకు ఎంత రేషన్ బియ్యం అందించాలో ఆ షాపులకు గోదాం నుంచి కాంట చేసి డీలర్లకు అందజేస్తారు. అయితే డీలర్లకు ప్రతినెలా మిగులు రేషన్ గుర్తించి కోట మొత్తం రేషన్ షాపుకు రాకుండానే పక్క దారి పట్టించేందుకు డీలర్లు గోదాం వద్ద అధికారులకు ముడుపులు చెల్లించి తమ కోటలోని బియ్యం అక్కడే నిల్వచేసి లారీల ద్వారా రాత్రివేళలో కర్ణాటక ప్రాంతాలకు తరలిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం.
పోలీసుల హస్తం...!
దళారులు అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యం దందాలో ఏఎస్ఐ, హెడ్ కానిస్టేబుల్ తో పాటు పలువురు సిబ్బంది హస్తం ఉన్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. వీరందరు ఒక టీమ్ గా ఏర్పడి తమ డ్యూటీ లో అక్రమాలకు పాల్పడుతున్నట్లు సమాచారం. ఈ తతంగం అంతా రాత్రి వేళల్లో పెట్రోలింగ్ పేరుతో పోలీసులు అక్రమార్కులకు వెన్నంటి ఉండి కర్ణాటక సరిహద్దు గల మైల్వార్, నీళ్ళపల్లి,ఇందర్ చెడ్,నవంద్గి గ్రామాల నుండి రేషన్ బియ్యాన్ని సరిహద్దులు దాటిస్తున్నారు.దీనికోసం ప్రతి నెల మూడు వేల చొప్పున ఒక్కొక్క ఆటో నుంచి మామూళ్లు తీసుకుంటున్నారు.ఇలా సుమారుగా 50 వేల వరకు మామూలు పుచ్చుకుంటున్నట్లు విశ్వనీయ సమాచారం.
తహసీల్దార్ వై వెంకటేష్ వివరణ :-
డీలర్లు అక్రమాలకు పాల్పడినట్లు తెలితే వారి డీలర్షిప్ రద్దు చేస్తామని బషీరాబాద్ తహసీల్దార్ వై వెంకటేష్ అన్నారు. రెండు రోజుల్లో డీలర్ లతో సమావేశం ఏర్పాటు చేసి అక్రమ బియ్యం సరఫరా పై ఆదేశాలు జారీ చేస్తామని పేర్కొన్నారు.
ఎస్ఐ ఎంఏ గబ్బర్ వివరణ :-
పోలీస్ సిబ్బంది ఎవరైనా అక్రమాలకు పాల్పడినట్లు ఆరోపణలు వచ్చిన యెడల వారి వివరాలను ఉన్నత అధికారుల దృష్టికి తీసుకెళ్తానని అన్నారు. అక్రమాలకు పాల్పడుతున్న వారిపై శాఖ పరమైన చర్యలు తప్పవన్నారు. ఇకనుండి అక్రమాలపై గట్టి చెక్ పెట్టనున్నట్లు బషీరాబాద్ ఎస్ ఐ గఫార్ తెలిపారు.