Niva Bupa IPO: నవంబర్ 6 నుంచి నివా బుపా హెల్త్ ఇన్సూరెన్స్ ఐపీఓ.. పూర్తి వివరాలివే..!

by Maddikunta Saikiran |
Niva Bupa IPO: నవంబర్ 6 నుంచి నివా బుపా హెల్త్ ఇన్సూరెన్స్ ఐపీఓ.. పూర్తి వివరాలివే..!
X

దిశ, వెబ్‌డెస్క్: ఇటీవల కాలంలో దేశీయ స్టాక్ మార్కెట్(Stock Market)లోకి ప్రవేశించేందుకు చాలా కంపెనీలు ఆసక్తి కనబరుస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే పబ్లిక్ ఇష్యూల కోసం సంస్థలు లైన్ కడుతున్నాయి. తాజాగా ప్రముఖ హెల్త్ ఇన్సూరెన్స్(Health Insurance) సంస్థ నివా బుపా (Niva Bupa) కంపెనీ లిమిటెడ్ కూడా త్వరలోనే ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్(IPO)లోకి వచ్చేందుకు రెడీ అయ్యింది. ఐపీఓ ద్వారా దాదాపు రూ. 2,200 కోట్లను ఆ సంస్థ సమీకరించనుంది . ఇందుకు సంబంధించిన సబ్‌స్క్రిప్షన్‌(Subscription) నవంబర్ 6న ప్రారంభమై 8న ముగియనుంది. యాంకర్ ఇన్వెస్టర్లకు(Anchor Investors) నవంబర్ 5నే బిడ్డింగ్ విండో తేర్చుకోనుంది. ఇందులో ఆఫర్ ఫర్ సేల్ (OFS) ద్వారా రూ.1400 కోట్ల నిధుల సేకరణ లక్ష్యాన్ని నిర్దేశించుకోగా, తాజా ఈక్విటీ షేర్ల విక్రయం ద్వారా రూ. 800 కోట్లను సమీకరించనున్నారు. లాట్ సైజ్, షేర్ల ధరను కంపెనీ తొందర్లోనే ప్రకటించనుంది. కాగా బుపా హెల్త్ ఇన్సూరెన్స్ కంపనీ లిమిటెడ్ లో ప్రమోటర్లు 89.07 శాతం వాటాను కలిగి ఉన్నారు. అయితే ఐపీఓ ద్వారా సమీకరించే నిధుల్లో కొంత మొత్తాన్ని నికర ఆదాయాన్ని వృద్ధి చేయడానికి, మిగిలిన నిధులను కార్పొరేట్ అవసరాలకు వినియోగించనున్నట్లు కంపెనీ వెల్లడించింది.

Advertisement

Next Story