- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
CM Chandrababu:చిన్నారి పై లైంగికదాడి ఘటనపై సీఎం దిగ్భ్రాంతి.. అధికారులకు కీలక సూచనలు
దిశ,వెబ్‌డెస్క్: ఏపీలో ఇటీవల మహిళలు, బాలికల పై లైంగికదాడి(sexual assault) ఆపై హత్య ఘటనలు చోటు చేసుకుంటున్న సంగతి తెలిసిందే. ఇటీవల కడప జిల్లా బద్వేల్‌లో జరిగిన ఘటన మరువక ముందే మరో ఘటన వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే.. తాజాగా మూడు నెలల చిన్నారిపై లైంగిక దాడి(sexual assault), అనంతరం హత్య చేసిన ఘటన చోటుచేసుకుంది. తిరుపతి జిల్లాలో అభం శుభం తెలియని చిన్నారిపై లైంగిక దాడి ఆపై హత్య ఘటనపై సీఎం చంద్రబాబు(CM Chandrababu) దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ క్రమంలో బాధిత కుటుంబానికి రూ.10 లక్షల పరిహారం ఇవ్వాలని కలెక్టర్‌ను ఆదేశించారు. ఈ ఘటనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబు నిందితుడికి కఠిన శిక్ష పడేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఈ ఘటన హోం మంత్రి అనిత స్పందించిన విషయం తెలిసిందే. రేపు(ఆదివారం) హోం మంత్రి అనిత(Home Minister Anitha) బాధిత కుటుంబాన్ని పరామర్శించనున్నారు. ఈ క్రమంలో బాధిత కుటుంబానికి 10 లక్షల రూపాయల చెక్కును అందజేయనున్నారు.