YCP: యురేనియం తవ్వకాలపై వైసీపీ విధానం ప్రకటన

by Gantepaka Srikanth |
YCP: యురేనియం తవ్వకాలపై వైసీపీ విధానం ప్రకటన
X

దిశ, వెబ్‌డెస్క్: కర్నూలు(Kurnool) జిల్లా దేవనకొండ మండలంలో యురేనియం తవ్వకాల(Uranium Mining)కు వ్యతిరేకంగా ఆందోళనలు తీవ్రమయ్యాయి. కప్పట్రాళ్ల అటవీ ప్రాంతంలో యురేనియం(Uranium) నిక్షేపాల కోసం సర్వే నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. దీనిని స్థానికులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. 20 గ్రామాల ప్రజలు గతకొన్ని రోజులుగా పార్టీలకతీతంగా సమావేశాలు నిర్వహిస్తూ ఆందోళనలు చేస్తున్నారు. పలు గ్రామాల్లో గ్రామసభలు నిర్వహించి.. శాంపిల్స్ కోసం వచ్చే అధికారులను అడ్డుకోవాలని తీర్మానాలు సైతం చేసుకున్నాయి.

తాజాగా.. విపక్ష వైసీపీ పార్టీ యురేనియం తవ్వకాలపై తమ విధానం ప్రకటించింది. దీనిని శనివారం ఆ పార్టీ ఎమ్మెల్యే విరూపాక్షి(MLA Virupakshi) మీడియా సమావేశంలో ప్రకటించారు. యురేనియం తవ్వకాలను ప్రజలందరూ వ్యతిరేకిస్తున్నారు. ప్రజల నిర్ణయమే తమ పార్టీ ఈ నిర్ణయం తీసుకుందని విరూపాక్షి వెల్లడించారు. మాజీ సీఎం జగన్(Jagan) కూడా ప్రజల నిర్ణయం మేరకే వెళ్లాలని సూచించారు. గ్రామానికి వెళ్తుంటే పోలీసులు అడ్డుకుంటున్నారు. యురేనియం తవ్వకాలను కచ్చితంగా అడ్డుకుంటాం. అవసరమైతే ఆమరణ నిరాహార దీక్షలకు దిగుతామని ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్షి(MLA Virupakshi) కీలక ప్రకటన చేశారు.

Advertisement

Next Story