- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
గడ్డం లేని కారణంగా 281 మంది భద్రతా సిబ్బందిని తొలగించిన తాలిబన్ ప్రభుత్వం.. !
దిశ, వెబ్‌డెస్క్: ఎక్కడైనా లంచం తీసుకున్న అధికారులనో లేదా విధుల్లో నిర్లక్ష్యం వహించిన వారినో డ్యూటీ నుంచి తొలగించడం చూశాం, కానీ అఫ్గానిస్థాన్ దేశంలో విచిత్రంగా గడ్డం లేని కారణంగా 281 మంది భద్రతా సిబ్బందిని తొలగించారు. గడ్డం పెంచడంలో విఫలమైనందుకు తాలిబాన్ నైతిక మంత్రిత్వ శాఖ వారిని డ్యూటీ నుంచి తొలగించింది. ఇస్లామిక్ చట్టానికి అనుగుణంగా తాలిబన్ లో పని చేసే ప్రతి ఒక్కరు గడ్డం పెంచుకోవాలని లేని పక్షంలో వారిని డ్యూటీ నుంచి తొలగిస్తామని తాలిబన్ ప్రభుత్వం తెలిపింది.అలాగే అఫ్గానిస్థాన్ దేశంలో గత సంవత్సరం నుండి అనైతిక చర్యలకు పాల్పడిన 13,000 మందిని అదుపులోకి తీసుకున్నట్లు అధికారులు మంగళవారం తెలిపారు.
కాగా 2021లో అఫ్గానిస్థాన్ ను తాలిబాన్‌లు స్వాధీనం చేసుకున్న తర్వాత మహిళా మంత్రిత్వ శాఖ స్థానంలో నైతిక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేశారు. తాలిబన్ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత ఈ శాఖ ముఖ్యంగా మహిళలపై ఆంక్షలు విధిస్తూ వస్తోంది. అలాగే అఫ్గానిస్థాన్ ప్రజలకు భావప్రకటనా స్వేచ్ఛను లేకుండా చేస్తోంది . కాగా గతంలో అనేకసార్లు నైతిక మంత్రిత్వ శాఖ అధికారులు మహిళలు హిజాబ్ ధరించనందుకు వారిని ఆపి, కేసులు పెట్టి జైలులో నిర్బంధించారు. దీంతో ఈ శాఖపై మానవ హక్కుల సంస్థలు అలాగే ఐక్యరాజ్యసమితి బహిరంగంగానే ఎన్నో సార్లు విమర్శలు చేశాయి.