- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
పశ్చిమాసియాలో ఉద్రిక్త వాతావరణం.. అప్రమత్తమైన ఇజ్రాయెల్
దిశ, నేషనల్ బ్యూరో: డమాస్కస్‌లోని ఇరాన్ రాయబార కార్యాలయంపై దాడి చేసి ఇద్దరు జనరల్స్‌తో సహా ఏడుగురు రివల్యూషనరీ గార్డ్‌లను చంపినందుకు ప్రతీకారం తీర్చుకుంటామని ఇరాన్ ప్రకటించడంతో ఇజ్రాయెల్ అప్రమత్తమైంది. ఇరాన్ అత్యున్నత నాయకుడు, అయతుల్లా అలీ ఖమేనీ, ఇజ్రాయెల్ శిక్షించబడాలి అని బుధవారం హెచ్చరించాడు, అతని సలహాదారుల్లో ఒకరు ఇజ్రాయెల్ రాయబార కార్యాలయాలు ఇకపై సురక్షితంగా ఉండవు అని చెప్పారు. దీంతో ఏ క్షణంలోనైనా ఇరాన్ దాడి చేసే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రపంచ దేశాలు పరిస్థితులను క్షుణ్ణంగా గమనిస్తున్నాయి.
అయితే ఇజ్రాయెల్‌పై దాడి చేస్తే అమెరికా దానికి మద్దతుగా నిలిస్తుందని ఇరాన్ భావిస్తుంది. ఈ నేపథ్యంలో అమెరికా సెంట్రల్ కమాండ్ చీఫ్ మైఖేల్ కురిల్లా గురువారం ఇజ్రాయెల్‌కు వెళ్లి రక్షణ మంత్రి యోవ్ గాలంట్‌తో పరిస్థితి గురించి చర్చించారు. దాడి విషయంపై అమెరికా, ఇజ్రాయెల్‌ను హెచ్చరించింది. ఇజ్రాయెల్ విదేశాంగ మంత్రి కాట్జ్ సోషల్ మీడియా ఎక్స్‌లో ఇరాన్ తన భూభాగం నుండి దాడి చేస్తే, ఇజ్రాయెల్ స్పందించి ఇరాన్‌పై దాడి చేస్తుంది, తాము ఎలాంటి దాడినైనా ఎదుర్కోడానికి సిద్ధంగా ఉన్నామని అని బదులిచ్చారు.
ఇజ్రాయెల్‌కు అమెరికా అధ్యక్షుడు బైడెన్ అభయహస్తం ఇచ్చారు. ఆ దేశానికి తాము పూర్తి స్థాయిలో అండగా నిలుస్తామని అన్నారు. బ్రిటన్ కూడా ఈ విషయంలో స్పందించి ఇరాన్ బెదిరింపులను అంగీకరించబోమని తాము కూడా ఇజ్రాయెల్‌కు మద్దతు ఇస్తామని స్పష్టం చేసింది. ఇరాన్-ఇజ్రాయెల్ రెండూ సంయమనం పాటించాలని రష్యా పిలుపునిచ్చింది.