Sunita Williams: సునీత విలియమ్స్ జీతం ఎంతో తెలిస్తే షాక్ కి గురవాల్సిందే.. ఎంతంటే..?

by Maddikunta Saikiran |
Sunita Williams: సునీత విలియమ్స్ జీతం ఎంతో తెలిస్తే షాక్ కి గురవాల్సిందే.. ఎంతంటే..?
X

దిశ, వెబ్‌డెస్క్: భారత సంతతికి చెందిన వ్యోమగామి సునీత విలియమ్స్,అలాగే బుచ్ విల్మోర్‌లు గత జూన్ నెలలో అంతరిక్ష కేంద్రానికి చేరుకున్న విషయం తెలిసిందే. 8 రోజుల తర్వాత వారు భూమికి చేరుకోవాల్సి ఉన్నప్పటికీ వారిని గమ్యం చేర్చే వ్యోమనౌక బోయింగ్ స్టార్‌లైనర్ క్యాప్సూల్ లోని కొన్ని సమస్యలు తలెత్తడంతో వారు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం(ISS)లోనే ఉండిపోవాల్సి వచ్చింది. ఇక వచ్చే ఏడాది ఎలన్ మస్క్‌ సంస్థకు చెందిన ఎక్స్‌ వ్యోమనౌకలో వారు భూమికి చేరుకుంటారని నాసా చీఫ్ బిల్ నెల్సన్ చెప్పారు. ఇద్దరు వ్యోమగాములు 2025 ఫిబ్రవరిలో భూమికి తిరిగి వస్తారని నాసా వెల్లడించింది.దీంతో వీరిద్దరు ఇంకో ఆరు నెలల పాటు అంతరిక్షంలో ఉండనున్నారు.

ఇదిలా ఉంటే నాసాలో పని చేసే వ్యోమగాముల జీతాల ఎంతనేది ఇప్పుడు చాలా మంది మదిలో ప్రశ్నలు మొదలయ్యాయి. వ్యోమగాముల జీత భత్యాలు వారికి ఉన్న అనుభవం , పని చేస్తున్న సంస్థ , వారు నిర్వహించే బాధ్యతలను బట్టి మారుతూ ఉంటాయి. కాగా ప్రపంచంలోనే రాకెట్ ప్రయోగాలలో ఎల్లప్పుడూ ముందంజలో ఉండే నాసాలోని వ్యోమగాములకు భారీ జీతాలు ఉన్నట్టు సమాచారం. సాధారణంగా నాసా వ్యోమగాములు US ప్రభుత్వ జనరల్ షెడ్యూల్ ఫెడరల్ పే స్కేల్ కింద పరిగణించబడుతారు. షేర్ ఇంపుల్స్ తెలిపిన వివరాల ప్రకారం నాసాలో వర్క్ చేసే వ్యోమగాములు సంవత్సరానికి దాదాపుగా ఒక కోటి ఇరవైలక్షల(1.20 Crores)కు పైగా సంపాదిస్తున్నారు. ఇదే జీతం సునీత విల్లియమ్స్ కి కూడా అందుతదని తెలుస్తోంది.ఇవే గాక ఇతర ప్రయోజనాలు, అలవెన్సులు కూడా ఉంటాయి.

Advertisement

Next Story