- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
ఇజ్రాయెల్‌లోని భారతీయులకు హెచ్చరికలు జారీచేసిన విదేశాంగ శాఖ
దిశ, నేషనల్ బ్యూరో: ఇరాన్-ఇజ్రాయిల్ మధ్య ఉద్రిక్తతలు మరింత తీవ్రమవుతున్నాయి. ఈ నేపథ్యంలో డ్రోన్‌లు, క్షిపణులను ఇరాన్ ప్రయోగించగా వాటిని అడ్డుకున్నట్లు ఇజ్రాయెల్ ప్రకటించింది. అయితే పశ్చిమాసియాపై యుద్ధ మేఘాలు కమ్ముకున్న కారణంగా భారత ప్రభుత్వం ఇజ్రాయెల్‌లో ఉన్నటువంటి తన జాతీయులకు కీలక హెచ్చరికలు జారీచేసింది. అలజడుల నేపథ్యంలో భారత సంతతి ప్రజలు ప్రశాంతంగా ఉండాలని, ఎలాంటి ఆందోళనలకు లోనుకావద్దని స్థానిక అధికారులు జారీ చేసిన భద్రతా ప్రోటోకాల్‌లను పాటించాలని కోరింది. ఇజ్రాయెల్‌లోని భారత రాయబార కార్యాలయం కూడా హెల్ప్‌లైన్ నంబర్‌లను జారీ చేసింది. భారతీయ పౌరులందరూ రాయబార కార్యాలయంలో నమోదు చేసుకోవాలని కోరింది.
ప్రస్తుత పరిస్థితుల్లో ఆ దేశాలకు ప్రయాణాలు వాయిదా వేసుకోవడం లేదా రద్దు చేసుకోవాలని, ఇక్కడి ప్రజలకు కూడా అలర్ట్‌లు జారీ చేసింది. ఈ ప్రాంతంలోని మా రాయబార కార్యాలయాలు భారత ప్రజలతో ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుపుతున్నాయని విదేశీ మంత్రిత్వ శాఖ తెలిపింది. అంతకుముందు భారత్ ఒక ప్రకటనలో ఇరాన్-ఇజ్రాయిల్ దేశాలు కూడా సమన్వయం పాటించాలని, సమస్యలను శాంతి యుతంగా పరిష్కరించుకోవాలని కోరింది. ఇరాన్ 200కు పైగా బాలిస్టిక్ క్షిపణులు, క్రూయిజ్ క్షిపణులు, డ్రోన్‌లను ప్రయోగించగా చాలా వాటిని మా భూమి మీద ల్యాండింగ్ కాకుండానే మిత్రదేశాల సహాయంతో అడ్డుకున్నామని ఇజ్రాయెల్ మిలిటరీ తెలిపింది