- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
gambling : దీపావళి జూదం మళ్లీ రెక్కలు తొడిగేనా...?
దిశ ,ఆర్మూర్ : ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో గత కొన్ని సంవత్సరాలుగా దీపావళి పర్వదిన జూదం మళ్లీ జూలు విదిల్చి పట్టాలెక్కేల కనబడుతున్నట్లు జిల్లాలో జోరుగా చర్చ జరుగుతుంది. నిజామాబాద్ జిల్లా పోలీస్ కమిషనర్ పోస్ట్ ఖాళీ ఉండడంతో పాటు.. అంతకు ముందు ఉన్న జిల్లా పోలీస్ కమిషనర్ టాస్క్ ఫోర్స్ ను మార్చేందుకు తను ఉన్న సమయంలోనే టాస్క్ ఫోర్స్ విభాగంలో అధికారులను బదిలీ చేయడంతో పాటు.. పలువురు సస్పెన్షన్ కు గురైన విషయం తెలిసిందే. జిల్లాలో దీపావళి జూదం పై ఉక్కు పాదం మోపె జిల్లా పోలీస్ కమిషనర్ పోస్ట్ ఖాళీ తో పాటు, జిల్లా టాస్క్ఫోర్స్ చేష్టలు ఉడిగినట్టు సిబ్బంది లేకపోవడంతో అడ్రస్ లేకుండా తయారైంది. దీంతో జిల్లా వ్యాప్తంగా దీపావళి జూదాన్ని మళ్లీ పట్టా లెక్కించేందుకు జూదరులు పన్నాగాలు పన్నుతూ కేంద్రాలను సిద్ధం చేసుకున్నట్లు బహిరంగంగా చర్చ జరుగుతుంది. జిల్లాలోని నలుమూలల్లో దీపావళి సందర్భంగా.. జూదరులు ఎంచక్కా జూదాన్ని ఆడేందుకు రహస్య ప్రాంతాలను ఎంపిక చేసుకుంటూ అడ్డాలను సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తుంది. నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా జిల్లాలోని ఆయా ఏరియాలోని స్థానిక పోలీసులంతా జూదం విషయంలో సైలెంట్ గా మారడంతో.. దీపావళి సందర్భంగా సోదరులకు ఆడుకున్నోళ్లకు ఆడుకున్నంతగా ప్రస్తుత సమయంలో జూదం తయారయింది.
గతంలో జిల్లా సీపీగా పని పనిచేసిన కల్మేశ్వర్ జిల్లాలో పలు స్టార్ హోటల్లు, పలువురు మహిళ పేకాట రాణులపై , ఫంక్షన్ హాళ్లు, బంకెట్ హాల్లు, ఆర్మూర్ ప్రాంతంలోని పలు వ్యవసాయ క్షేత్రాల్లోని పేకాట అడ్డాలపై టాస్క్ ఫోర్స్ తో దాడులు చేయించి.. పేకాట స్థావరాలపై విరుచుకుపడి జిల్లాలో ప్రముఖుల పేకాటరాయుళ్ల అడ్డాల గుట్టులను రట్టు చేయించారు. జిల్లాలో పేకాట అడ్డాల నిర్వహణ ఒక వ్యాపారంలా మార్చుకుంటూ ప్రతినిత్యం అడ్డాలను మారుస్తూ.. టాస్క్ ఫోర్స్ పోలీసులను మేనేజ్ చేసుకుంటూ దర్జాగా పేకాట దందాను జిల్లాలో నిర్వహిస్తుండగా అప్పటి సిపి కల్మేశ్వర్ ఈ పేకాట అడ్డాలను వ్యాపారంగా మార్చుకునే వారిపై ప్రత్యేకంగా దృష్టి పెట్టి ..జిల్లాలో పేకాటను కట్టడి చేశారు. ప్రస్తుతం జిల్లా సిపి కల్మేశ్వర్ బదిలీ కావడంతో ఆ పోస్ట్ ఖాళీగా ఉండడంతో పాటు, గతంలో పనిచేసిన టాస్క్ ఫోర్స్ అధికారులు లేక చేష్టలుడికి సిబ్బంది లేక అడ్రస్ లేకుండా తయారైంది. దీనికి తోడు జిల్లాలోని అన్ని ఏరియాల్లో స్థానిక పోలీసులు జూదం విషయంలో సైలెంట్ కావడంతో దీపావళి సందర్భంగా జూదం పై కన్నేసిన జూదరులు హిస్టారీతిగా అడ్డాలను ఏర్పరచుకొని దీపావళి జూదం మళ్లీ జూలు విధించేలా పట్టాలెక్కించేలా కనబడుతున్నట్లు జిల్లాలో జోరుగా చర్చ జరుగుతుంది.