- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
Additional Collector:దేశ సమైక్యత, సమగ్రత కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలి
దిశ, హైదరాబాద్ బ్యూరో: దేశ సమైక్యత, సమగ్రత కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని అదనపు కలెక్టర్ (లోకల్ బాడీస్) కదిరి వన్ పళని(Additional Collector (Local Bodies) Kadiri One) అన్నారు. దేశ తొలి హోమ్ మంత్రి, ఉక్కుమనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి, రాష్ట్రీయ ఏక్తా దివస్ ను పురస్కరించుకుని గురువారం కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్ లో నిర్వహించిన కార్యక్రమంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ చిత్రపటానికి ఆయన పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ.. దేశం ఐక్యతతో ముందుకు సాగాలన్నదే సర్దార్ వల్లభాయ్ పటేల్ లక్ష్యమని, అయనను నేటి తరం ఆదర్శంగా తీసుకోవాలని అన్నారు. ఈ సందర్భంగా ఆయన అధికారులు, సిబ్బందితో రాష్ట్రీయ ఏక్తా దివస్ ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో కలెక్టరేట్ ఏఓ సదానందం, జహీరుద్దీన్, జిల్లా అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.