Russian president Vladimir Putin :లింగ మార్పిడి నిషేధ బిల్లుకు ఆమోదం

by Mahesh |   ( Updated:2023-07-25 05:44:16.0  )
Russian president Vladimir Putin :లింగ మార్పిడి నిషేధ బిల్లుకు ఆమోదం
X

దిశ, వెబ్‌డెస్క్: రష్యా ప్రభుత్వం తమ దేశంలో లింగమార్పిడి, లింగ-ధ్రువీకరణ విధానాలను నిషేధించింది. దీనికి సంబంధించిన చట్టంపై అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ సోమవారం సంతకం చేశారు. ఈ కొత్త చట్టం రష్యాలో.. "వ్యక్తి యొక్క లింగాన్ని మార్చడానికి ఉద్దేశించిన వైద్య జోక్యాలను.. అలాగే అధికారిక పత్రాలు, పబ్లిక్ రికార్డ్‌లలో ఒకరి లింగాన్ని మార్చడాన్ని నిషేధిస్తుంది. కాగా ఎవరైనా వ్యక్తులు తమ పుట్టుకతో వచ్చిన బావాలకనుగునంగా చేసే చికిత్సకు మాత్రమే ఈ చట్టం మినహాయింపు ఇస్తుంది.

కాగా LGBTQ వ్యక్తులపై రష్యా యొక్క అణచివేత ఒక దశాబ్దం క్రితం ప్రారంభమైంది. పుతిన్ ప్రభుత్వం మొదటిసారి రష్యన్ ఆర్థోడాక్స్ చర్చి మద్దతుతో "సాంప్రదాయ కుటుంబ విలువలు" కాపాడేందుకు కొత్త చట్టంపై దృష్టి పెట్టింది. పాశ్చాత్య కుటుంబ వ్యతిరేక భావజాలం" నుంచి రష్యాను రక్షించడానికి ఈ చట్టం ఉందని కొందరు లింగ పరివర్తనను "స్వచ్ఛమైన సాతానిజం"గా అభివర్ణించారు.

Read More : ఇమ్రాన్ ఖాన్‌ పై నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్

Advertisement

Next Story

Most Viewed