- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
ఇండోనేషియాలోని పార్కులో కనిపించిన అరుదైన జావాన్ ఖడ్గమృగం దూడ
దిశ, నేషనల్ బ్యూరో: ఇండోనేషియా జాతీయ ఉద్యానవనంలో కొత్త జావాన్ ఖడ్గమృగం దూడ కనిపించింది, ఇది ప్రపంచంలోనే అత్యంత అంతరించిపోతున్న క్షీరదాలలో ఒకటిగా ఉంది. ఇప్పుడు అది కనిపించడంతో పర్యావరణ వేత్తలు, అక్కడి ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. జావా ద్వీపంలోని ఉజుంగ్ కులోన్ నేషనల్ పార్క్‌లో126 కెమెరాలను ఏర్పాటు చేయగా, వాటిలో ఒకదానిలో ఈ ఖడ్గమృగం దూడ కనిపించింది. ఈ ఫుటేజీలో ఉన్న దాని ప్రకారం, ఇది మూడు నుంచి ఐదు నెలల మధ్య ఉంటుందని అంచనా. తన తల్లితో కలిసి నడుస్తున్నట్లుగా తెలుస్తుంది. అయితే ఇది ఆడదా, మగదా అని మాత్రం తెలియరాలేదు.
చాలా అరుదుగా కనిపించే ఇవి ఉజుంగ్ కులోన్‌లో మాత్రమే ఉంటాయి. ఇప్పుడు ఈ కొత్త దూడ కెమెరాకు చిక్కడంతో జవాన్ ఖడ్గమృగాల సంతానోత్పత్తి పెరుగుతుందని నిరూపితమైనట్లు సీనియర్ పర్యావరణ మంత్రిత్వ శాఖ అధికారి ఒక ప్రకటనలో తెలిపారు. జావాన్ ఖడ్గమృగాలు వదులుగా ఉండే చర్మం, మడతలు కలిగి ఉంటాయి, ఇవి కవచం పూత పూసినట్లు ఉంటుంది. ఇవి ఒకప్పుడు ఆగ్నేయాసియా అంతటా వేల సంఖ్యలో ఉండేవి. అయితే వేట, అటవీ నిర్మూలన కారణంగా అవి తమ ఆవాసాలను కోల్పోయి అంతరించిపోతున్న దశకు చేరుకున్నాయి.