ఇజ్రాయిల్‌కు వ్య‌తిరేకంగా అమెరికాలో నిర‌స‌నలు.. భారతీయ విద్యార్థిని అరెస్ట్

by Ramesh N |
ఇజ్రాయిల్‌కు వ్య‌తిరేకంగా అమెరికాలో నిర‌స‌నలు.. భారతీయ విద్యార్థిని అరెస్ట్
X

దిశ, డైనమిక్ బ్యూరో: అమెరికాలోని ప్రిన్స్‌ట‌న్ యూనివ‌ర్సిటీలో పాల‌స్తీనా అనుకూల నిర‌స‌న ప్ర‌ద‌ర్శ‌న‌లో పాల్గొన్న భారతీయ సంతతికి చెందిన విద్యార్థిని స్థానిక పోలీసులు అరెస్టు చేశారు. గాజాలో ఇజ్రాయెల్- హమాస్ యుద్ధానికి వ్యతిరేకంగా అమెరికా అంతటా ప్రధాన విశ్వవిద్యాలయాల్లో తాజాగా నిరసనల చేపట్టారు. ఈ క్రమంలోనే తమిళనాడులోని కోయంబత్తూర్‌‌కు చెందిన అచింత్య శివ‌లింగ‌న్‌ను మరో తోటి విద్యార్థి హసన్ సయ్యద్‌తో కలిసి ప్రిన్స్‌ట‌న్ వర్సిటీలో నిరసనలు చేపట్టారు. దీంతో వారిని అరెస్టు చేసినట్లు ప్రిన్స్‌టన్ అలుమ్ని వీక్లీ నివేదించింది. అయితే గురువారం ఉదయం విద్యార్థులు అధికారుల హెచ్చరికలను పట్టించుకోకుండా యూనివర్శిటీ‌లోని మెక్‌కోష్ ప్రాంగణంలో టెంట్‌లను ఏర్పాటు చేసిన నిరసనలు చేపట్టేందుకు ప్రయత్నించారని అధికారులు ఆరోపించారు.

దీంతో వ‌ర్సిటీ నియ‌మావ‌ళి ఉల్లంఘించారని, వారిని అరెస్టు చేసి, త‌క్ష‌ణ‌మే వాళ్ల‌ను క్యాంప‌స్‌ నుంచి డిబార్ చేసిన‌ట్లు వ‌ర్సిటీ ప్ర‌తినిధి జెన్నిఫ‌ర్ మోరిల్ వెల్లడించారు. టెంట్లు వేయ‌వ‌ద్దు అని ఎన్ని సార్లు హెచ్చరికలు జారీచేసిన వారు ప‌ట్టించుకోలేద‌ని, దీంతో వాళ్ల‌ను అరెస్టు చేయాల్సి వ‌చ్చిన‌ట్లు వ‌ర్సిటీ అధికారులు ప్రకటించారు. ప్రిన్స్‌ట‌న్ వ‌ర్సిటీలోని ప‌బ్లిక్ అఫైర్స్ ఇన్ ఇంట‌ర్నేష‌నల్ డెవ‌ల‌ప్మెంట్ స‌బ్జెక్ట్‌లో భారతీయ విద్యార్థిని అచింత్య శివ‌లింగ‌న్‌ మాస్ట‌ర్స్ చ‌దువుతోంది.

Advertisement

Next Story

Most Viewed