sheikh hasina: బంగ్లాదేశ్ ప్రధాని రాజీనామా.. దేశం విడిచి పరార్

by Prasad Jukanti |
sheikh hasina: బంగ్లాదేశ్ ప్రధాని రాజీనామా.. దేశం విడిచి పరార్
X

దిశ, డైనమిక్ బ్యూరో: ప్రభుత్వ రిజర్వేషన్లను సవరించాలంటూ బంగ్లాదేశ్‌లో జరుగుతున్న ఆందోళనలు మరింత హింసాత్మకంగా మారాయి. ప్రజాందోళన మరింత ఉధృతం కావడంతో ఆ దేశ ప్రధాని షేక్ హసీనా తన పదవికి రాజీనామా చేశారు. ఈ విషయాన్ని ఆ దేశ ఆర్మీ చీఫ్ జనరల్ వాకర్-ఉజ్-జమాన్ ధ్రువీకరించారు. ఇప్పటికే సైనిక హెచ్చరికలతో హసీనా ఢాకాలోని తన అధికారిక నివాసాన్ని వదిలి తన సోదరితో కలిసి ఆర్మీ హెలికాప్టర్‌లో దేశం విడిచి పారిపోయారు. మరో వైపు ఆందోళనకారులు ఇవాళ ఢాకాలోని ప్రధాని ఇల్లు, ఆఫీస్‌ను ముట్టడించారు. ఢాకాలోని హసీనా తండ్రి విగ్రహాన్ని ధ్వంసం చేశారు. తాజాగా పరిణామాలపై ఆర్మీ చీఫ్ జమాన్ మీడియాతో మాట్లాడారు. రాజకీయ పార్టీలతో చర్చలు జరిపారు. అనంతరం సైనిక పాలన విధించినట్లు ఆర్మీ చీఫ్ వెల్లడించారు. త్వరలో దేశంలో తాత్కాలిక ప్రభుత్వం ఏర్పాటు అవుతుందని, ప్రజలంతా సంయమనం పాటించాలని సూచించారు.

Advertisement

Next Story