అప్పటి వరకు గాజాపై ఇజ్రాయెల్ యుద్ధాన్ని ఆపే ప్రసక్తే లేదు: ప్రధాన మంత్రి నెతన్యాహు

by Harish |
అప్పటి వరకు గాజాపై ఇజ్రాయెల్ యుద్ధాన్ని ఆపే ప్రసక్తే లేదు: ప్రధాన మంత్రి నెతన్యాహు
X

దిశ, నేషనల్ బ్యూరో: ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహు ఆదివారం కీలక ప్రకటన చేశారు. గాజా యుద్ధంలో ఇజ్రాయెల్ "విజయానికి ఒక అడుగు దూరంలో ఉంది" అని హమాస్ బందీలందరినీ విడిపించే వరకు దీనిని ముగించే ప్రసక్తి లేదని ప్రతిజ్ఞ చేశారు. యుద్ధాన్ని ముగించాలని అంతర్జాతీయంగా ఒత్తిడి వస్తుండగా, సంధి చర్చలు జరగుతుందనుకున్న తరుణంలో ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి, బందీలు తిరిగి రాకుండా కాల్పుల విరమణ ఉండదు. అది జరగదు అని ప్రకటించడం గమనార్హం. గత ఏడాది అక్టోబరు 7న హమాస్ మిలిటెంట్లు ఇజ్రాయెల్‌పై దాడిచేయగా 1200 మంది మరణించారు. అలాగే చాలా మందిని హమాస్ మిలిటెంట్లు బందీలుగా చేసుకున్నాయి. అప్పటి నుంచి హమాస్‌పై ఇజ్రాయెల్‌ దాడి చేస్తూనే ఉంది. ఇప్పటి వరకు ఈ యుద్ధంలో 33 వేలకు మందిపైగా మరణించగా, ఇంకా చాలా మంది గాయాలపాలయ్యారు.

ఈ యుద్ధాన్ని ముగించాలని అంతర్జాతీయంగా ఇజ్రాయెల్‌పై ఒత్తిడి వస్తుంది. అయిన్పప్పటికి కూడా నెతన్యాహు వెనక్కి తగ్గకుండా ఇజ్రాయెల్ లొంగిపోవడానికి సిద్ధంగా లేదు అని ప్రకటించారు. ఎవరైనా మమ్మల్ని బాధ పెట్టినా లేదా బాధపెట్టాలని ప్లాన్ చేసినా,, మేము వారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదు. మేము ఈ సూత్రాన్ని అన్ని సమయాలలో ఆచరించాము, ఇప్పుడు కూడా దీన్నే పాటిస్తున్నామని నెతన్యాహు అన్నారు. ఏప్రిల్ 1న గాజా వైమానిక దాడిలో అమెరికాకు చెందిన ఫుడ్ చారిటీ వరల్డ్ సెంట్రల్ కిచెన్‌కు చెందిన ఏడుగురు సహాయక సిబ్బంది మరణించడంపై ఇజ్రాయెల్ అంతర్జాతీయ ఆగ్రహాన్ని ఎదుర్కొంది. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ గురువారం నెతన్యాహుతో ఫోన్ కాల్‌లో "తక్షణ కాల్పుల విరమణ" చేయాలని సూచించారు.

Advertisement

Next Story