Nobel Prize: ఫిజిక్స్‌లో ముగ్గురికి నోబెల్..

by Vinod kumar |
Nobel Prize: ఫిజిక్స్‌లో ముగ్గురికి నోబెల్..
X

స్టాక్‌హోమ్, స్వీడన్: శాస్త్రవేత్తలు పియరీ అగోస్టిని, ఫెరెన్క్ క్రౌజ్, అన్నే ఎల్ హుల్లియర్స్.. 2023కు భౌతిక శాస్త్రంలో నోబెల్ బహుమతిని గెలుచుకున్నారు. పదార్థంలో(మెటీరియస్ సబ్‌స్టాన్స్) ఎలక్ట్రాన్ డైనమిక్స్ అధ్యయనం కోసం కాంతి ఆటోసెకండ్ పల్స్‌ను ఉత్పత్తి చేసే ప్రయోగాత్మక పద్ధతులకు గాను వీరు ఈ అత్యున్నత పురస్కారాన్ని సొంతం చేసుకున్నారు. ఈ ఏడాది 11 మిలియన్ స్వీడిష్ కిరీటాలకు (సుమారు 8.32 కోట్లు) పెంచబడిన బహుమతిని రాయల్ స్వీడిష్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ ప్రదానం చేస్తుంది.

కొవిడ్-19 వ్యాక్సిన్లకు మార్గం సుగమం చేసిన mRNA అణువుల ఆవిష్కరణలకు హంగేరియన్ శాస్త్రవేత్త కాటలిన్ కారికో, యూఎస్ సహోద్యోగి డ్రూ వీస్‌మాన్ మెడిసిన్ బహుమతిని గెలుచుకున్న తర్వాత.. భౌతికశాస్త్రంలో ఈ వారం ప్రదానం చేయబడినది రెండో నోబెల్. డైనమైట్ ఆవిష్కర్త, వ్యాపారవేత్త ఆల్ఫ్రెడ్ నోబెల్ సంకల్పంతో.. సైన్స్, సాహిత్యం, శాంతికి సంబంధించిన విజయాల్లో 1901 నుంచి కొన్ని అంతరాయాలతో నోబెల్ బహుమతులు ఇస్తున్నారు. ఇది శాస్త్రవేత్తలకు అత్యున్నత గౌరవంగా మారింది. గతేడాది అలైన్ ఆస్పెక్ట్, జాన్ క్లాజర్, ఆంటోన్ జైలింగర్.. క్వాంటం ఎంటాంగిల్‌మెంట్‌పై పని చేసినందుకు ఈ బహుమతిని గెలుచుకున్నారు.

Advertisement

Next Story

Most Viewed