BRS: జమ్మూ కాశ్మీర్, హర్యానా ఎన్నికల ఫలితాలు.. కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు

by Ramesh Goud |   ( Updated:2024-10-08 15:34:53.0  )
BRS: జమ్మూ కాశ్మీర్, హర్యానా ఎన్నికల ఫలితాలు.. కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు
X

దిశ, డైనమిక్ బ్యూరో: హామీలు ఇచ్చి అమలు చేయకపోవడం వల్ల ఏమవుతుందో కాంగ్రెస్ పార్టీకి బాగా అర్థమైందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. జమ్మూ కాశ్మీర్, హర్యానా అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు విడుదలైన విషయం తెలిసిందే. అయితే ఈ ఫలితాలపై స్పందించిన కేటీఆర్ దేశ రాజకీయాల గురించి పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ఆయన.. ఈరోజు ఎన్నికల ఫలితాల్లో కొన్ని విషయాలు స్పష్టంగా కనిపిస్తున్నాయని, మహారాష్ట్ర, జార్ఖండ్, ఢిల్లీ ఎన్నికల తర్వాత కూడా ఇదే నిజమవుతుందని ఆశిస్తున్నామని చెప్పారు.

2029లో జాతీయ పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్ రెండూ మేజిక్ ఫిగర్‌కు దూరంగా ఉండబోతున్నాయని, బలమైన ప్రాంతీయ పార్టీలు తదుపరి కేంద్ర ప్రభుత్వ ఏర్పాటుకు కీలకంగా మారబోతున్నాయని జోస్యం చెప్పారు. అలాగే బహుశా కనీసం మరో దశాబ్దం లేదా అంతకంటే ఎక్కువ కాలం పాటు ఇవి ఉండొచ్చని అభిప్రాయపడ్డారు. ఇక కాంగ్రెస్ పార్టీ కర్నాటకలో 5 హామీలు, హిమాచల్ ప్రదేశ్ లో 10 హామీలు. తెలంగాణలో 6 హామీలు ఇచ్చి ప్రజలను మోసగించిందని అన్నారు. అయితే హర్యానా ప్రజలు ఈ అబద్ధాలు, ప్రచారాలను గమణించారని చెప్పారు. ఇక కనెక్ట్ చేయబడిన ప్రపంచంలో.. వాగ్దానం చేసి, అది అందించకపోవడం వినాశకరమైనదని కాంగ్రెస్ బాగా అర్థం చేసుకుందని కేటీఆర్ రాసుకొచ్చారు.

Advertisement

Next Story

Most Viewed