Telangana Tourism: ప్రపంచ ప‌ర్యాట‌కుల‌ను ఆక‌ర్శించడ‌మే ల‌క్ష్యం

by Gantepaka Srikanth |
Telangana Tourism: ప్రపంచ ప‌ర్యాట‌కుల‌ను ఆక‌ర్శించడ‌మే ల‌క్ష్యం
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలోని పర్యాటక కేంద్రాల ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేసే ప్రక్రియను వేగవంతం చేసింది. అందులో భాగంగా టూరిజం ప్రమోష‌న్‌లో భాగంగా రూపొందించిన ప్రచార వీడియో (ఆడియో విజువ‌ల్ - ఏవీ)ని పర్యాటక శాఖ గురువారం విడుద‌ల చేసింది. ప్రపంచ న‌లుమూలాల నుంచి ప‌ర్యాట‌కుల‌ను ఆక‌ర్శించడ‌మే ల‌క్ష్యంగా స‌హ‌జ‌మైన ప్రకృతి అందాలు, వారసత్వ క‌ట్టడాలను ఈ వీడియోలో పొందుపర్చారు. తెలంగాణ ఏ వెయిట్స్ యూ (Telangana Awaits You) అనే పేరుతో రూపొందించిన 58 సెక‌న్ల నిడివి గ‌ల ఈ ప్రమోష‌నల్ వీడియోలో జోడేఘాట్ లోయ, నల్లమల అమ్రాబాద్ టైగర్ రిజర్వ్, కిన్నెరసాని వైల్డ్ లైఫ్ శాంక్చురీ, కుమ్రం భీం ప్రాజెక్ట్, ఎస్ఆర్ ఎస్పీ (నందిపేట) బ్యాక్ వాటర్స్, ప్రపంచ వారసత్వ ప్రదేశంగా యునెస్కో పొందిన రామ‌ప్ప ఆల‌యం, ప్రపంచ పర్యాటక సంస్థ (యూఎన్‌డబ్ల్యూటీవో) చే బెస్ట్ టూరిజం విలేజ్‌గా గుర్తింపు పొందిన భూదాన్‌ పోచంపల్లి, యాద‌గిరిగుట్ట ఆల‌యం, ఘనపురం కోటగుళ్ళు, పాండవుల గుట్ట, నాగార్జునసాగర్, ఘనపురం చెరువు, వంటి అద్భుత‌మైన ప‌ర్యాట‌క ప్రదేశాలు ఉన్నాయి. త్వరలోనే మరిన్ని పర్యాటక ప్రాంతాలకు చెందిన వీడియోలను రూపొందించబోతున్నారు. వాటిని సోషల్ మీడియా, మీడియాలోనూ విస్తృత ప్రచారం చేయడం జరుగుతుందని శాఖ అధికారులు తెలిపారు. తెలంగాణను టూరిజం హబ్ గా చేయడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నట్లు ఇప్పటికే ప్రభుత్వం ప్రకటించింది.

Advertisement

Next Story

Most Viewed