రాష్ట్ర అధ్యక్ష ఎన్నికకు ఎన్నికల అధికారులను ప్రకటించిన బీజేపీ

by Mahesh |   ( Updated:2025-01-03 11:13:10.0  )
రాష్ట్ర అధ్యక్ష ఎన్నికకు ఎన్నికల అధికారులను ప్రకటించిన బీజేపీ
X

దిశ, వెబ్‌డెస్క్: కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ(BJP) ఇప్పటికే సభ్యత్వ నమోదు(Membership registration) కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నిర్వహించింది. అలాగే దేశవ్యాప్తంగా యాక్టివ్ మెంబర్షిప్ (Active membership)ను కూడా పూర్తి చేసింది. దీంతో సంక్రాంతి పండుగ లోపు బూత్ అధ్యక్షుడి(Booth president) నుంచి.. జాతీయ అధ్యక్షుడి(National President) వరకు సంక్రాంతి లోపు ఎన్నిక జరగనుంది. ఈ క్రమంలో వివిధ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు(State presidents), జాతీయ కౌన్సిల్ సభ్యుల(National Council Members) ఎన్నికల కోసం ఎన్నికల అధికారులను నిర్ణయించింది. ఈ మేరకు గురువారం 29 మందితో కూడిన లిస్టును బీజేపీ కేంద్ర కార్యాలయం విడుదల చేసింది. అందులో గుజరాత్‌కు కేంద్రమంత్రి భూపేంద్ర యాదవ్‌, కర్ణాటకకు కేంద్రమంత్రి శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌, ఉత్తరప్రదేశ్‌కు కేంద్రమంత్రి పీయూష్‌ గోయల్‌, బీహార్‌కు కేంద్రమంత్రి మనోహర్‌లాల్‌ ఖట్టర్‌, మధ్యప్రదేశ్‌కు కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌, తెలంగాణ(Telangana)కు కేంద్ర మంత్రి శోభ కరంద్‌లాజే (Shobha Karandlaje)ను ఎన్నికల అధికారిగా నియమించారు.

Next Story

Most Viewed