పెళ్లై కొన్ని నెలలైనా ఇంత వరకూ ఫస్ట్ నైట్ జరగలేదు.. లోపల అలా తగులుతుందట!

by Bhoopathi Nagaiah |
పెళ్లై కొన్ని నెలలైనా ఇంత వరకూ ఫస్ట్ నైట్ జరగలేదు.. లోపల అలా తగులుతుందట!
X

డాక్టర్ గారూ.. నా పెళ్లై కొన్ని నెలవుతోంది. ఇంత వరకూ ఫస్ట్ నైట్ జరగలేదు. కారణం నా యోని లోపల అడ్డంగా ఏదో గడ్డలా తగులుతుందని మా వారంటున్నారు. చిన్నప్పుడు నాకు నడుము వద్ద దెబ్బ తగలడం వల్ల ఇలా యోనిలో అడ్డు ఏర్పడిందా? నెలసరి క్రమం తప్పకుండా వస్తుంది. నాకున్న ఈ సమస్యకు మందులు వాడితే సరిపోతుందా లేక ఆపరేషన్ చేయించుకోవాలా? పరిష్కారం చెప్పండి.

నీకు నెలసరి(Periods) క్రమం తప్పకుండా వస్తుందన్నావు. కాబట్టి ఈ సమస్యకు కారణం యోని(vagina)లో నీవన్నట్లు గడ్డకాదు. బహుశ యోని అడ్డంగా ఎక్కువ భాగం ఉండే హైమన్ పొర(Hyman membrane) లేదా పూర్తిగా కప్పబడి రంధ్రాలతో తెరచుకున్న హైమన్ ఉండొచ్చు. అలాగే కలయిక వేళ భయాందోళనలతో యోని కండరాలు (Vaginal muscles) బిగుసుకుపోయి, రంధ్రం పూర్తిగా మూసుకుపోతే కలయిక దుర్లభం అవుతుంది. పెళ్లైన కొత్తలో తొంభై శాతం మంది స్త్రీలలో ఇలాంటిదే జరుగుతుంది. దీన్ని 'వెజైనిస్మస్' (Vaginismus) అంటారు. నువ్వు ఒకసారి గైనకాలజిస్టు (Gynecologist)వద్దకు వెళ్లి పరీక్ష చేయించుకోడి. ఒకవేళ అది హైమన్ పొర వల్లనే అయితే 'హైనెక్టమీ'(Hyenectomy) అనే చిన్న ఆపరేషన్ చేస్తారు. ఉండలా తగిలేది గర్భాశయం (uterus) చివరి భాగం యోని నాళంలోకి తెర్చుకునే సర్విక్స్(Cervix) కావచ్చు. అలా కాకపోతే సెక్సాలజిస్టు(Sexologist)ను సంప్రదిస్తే ఆందోళన తగ్గించే విధంగా కౌన్సెలింగ్ ఇచ్చి కండరాలు బిగుసుకుపోకుండా రిలాక్సేషన్ ఎక్సర్ సైజ్లు నేర్పిస్తారు. దంపతులిద్దరూ సెక్సాలజిస్టును కలవాలి.

- డాక్టర్ భారతి, MS

మేరిటల్ కౌన్సెలర్

సైకోథెరపిస్ట్ & సెక్సాలజిస్ట్

Advertisement

Next Story