కంకర క్రషర్ల నిర్వహణకు తాత్కాలిక బ్రేక్..

by Aamani |
కంకర క్రషర్ల నిర్వహణకు తాత్కాలిక బ్రేక్..
X

దిశ, జిన్నారం: జిన్నారం మండలం లోని రాళ్లకత్వ గ్రామ శివారులో సర్వే నెంబర్ 286 అసైన్ భూమిలో కొందరు యజమానులు అక్రమంగా నకిలీ పత్రాలను సృష్టించి కంకర క్రషర్ పనులు కొనసాగిస్తున్న విషయమై గ్రామస్తులు సమిష్టిగా పోరాటం చేశారు. కంకర క్రషర్ల నిర్వహణ వల్ల ఎదురవుతున్న ఇబ్బందులు, ప్రజలు పడుతున్న సమస్యల కోసం న్యాయ పోరాటానికి గ్రామ ప్రజలు నడుం బిగించారు. గత కొన్ని రోజులుగా పూర్తి ఆధారాలతో రాష్ట్ర మైనింగ్ డైరెక్టర్ తోపాటు సీఎం రేవంత్ రెడ్డికి కంకర క్రషర్ల వల్ల ఎదురవుతున్న సమస్యలు, నిబంధనల ఉల్లంఘన తదితర విషయాలను వివరించారు. కంకర క్రషర్ల నిర్వహణతో ఎదురవుతున్న సమస్యలు, నిబంధనల ఉల్లంఘన తదితర విషయాలపై 'దిశ' దినపత్రికలో వరుస కథనాలు ప్రచురితమయ్యాయి.

ఈ కథనాలకు స్పందించిన అధికారులు మైనింగ్, ఇరిగేషన్, పొల్యూషన్ రెవెన్యూ అధికారులు సమిష్టిగా విచారణ జరిపి పూర్తి నివేదిక నివ్వాలని రాష్ట్ర అధికారులు అప్పట్లో ఆదేశాలు జారీ చేశారు. అధికారుల నుంచి పూర్తి నివేదికను సేకరించిన ప్రభుత్వం కంకర క్వారీలల్లో కొనసాగుతున్న పనులను తాత్కాలికంగా నిలిపివేయాలని రాష్ట్ర మైనింగ్ శాఖ డైరెక్టర్ నుంచి ఉత్తర్వులు వచ్చాయి. ఇందుకు సంబంధించిన ఉత్తర్వులను మంగళవారం గ్రామస్తులు రెవెన్యూ, పోలీసు అధికారులకు అందించారు.

ప్రభుత్వ మైనింగ్ శాఖ ఉత్తర్వులను సమాచారం కోసం సంబంధిత ప్రభుత్వ అధికారులకు అందజేశామని, కంకర క్వారీ క్రషర్ల యాజమాన్యం ప్రభుత్వ ఉత్తర్వులను ఉల్లంఘించకుండా తగిన చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు సంబంధిత అధికారులు కోరారు. రాష్ట్ర మైనింగ్ శాఖ డైరెక్టర్ ఉత్తర్వులను కంకర క్వారీ, క్రషర్ల యాజమాన్యం ఉల్లంఘిస్తే పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపడతామని, తమ గ్రామాన్ని రక్షించుకుంటామని గ్రామస్తులు తెలిపారు. కంకర క్రషర్ల యజమానులు గ్రామస్తులను ఇబ్బందులు పెట్టేలా వ్యవహరిస్తే మరోసారి రాష్ట్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేస్తామని గ్రామస్తులు తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed