- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
క్రీడాకారులు అవకాశం సద్వినియోగం చేసుకోవాలి : సిద్దిపేట కలెక్టర్
దిశ, సిద్దిపేట ప్రతినిధి : పల్లెల నుంచి ప్రపంచ స్థాయి విజేతలను వెలికితీయడానికి చీఫ్ మినిస్టర్ కప్-2024 ఒక చక్కటి వేదిక అని జిల్లా కలెక్టర్ మిక్కిలినేని మనుచౌదరి అన్నారు. చీఫ్ మినిస్టర్ కప్ 2024 టార్చ్ మంగళవారం సిరిసిల్ల జిల్లా నుండి సిద్దిపేట జిల్లాలోకి ప్రవేశించింది. పట్టణంలోని సిరిసిల్లా రోడ్డులో పెద్దమ్మ దేవాలయం వద్ద నుండి చీప్ మినిస్టర్ కప్-2024 టార్చ్ ర్యాలీని జిల్లా కలెక్టర్ జెండా ఊపి ప్రారంభించారు. కలెక్టర్ టార్చ్ ని పట్టుకుని క్రీడాకారులు, కోచ్ లతో ర్యాలీలో పాల్గొన్నారు . ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ...జిల్లా యువజన మరియు క్రీడా శాఖ వారి ఆధ్వర్యంలో జిల్లాలో చీప్ మినిస్టర్ కప్-2024 టార్చ్ ర్యాలీలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి అభినందనలు తెలిపారు.
జిల్లాలోని మారుమూల పల్లెలో గల క్రీడాకారులను వెలికి తీయడమే ఈ చీఫ్ మినిస్టర్ కప్ 2024 ముఖ్య ఉద్దేశమని అన్నారు. క్రీడల్లో జిల్లా నుంచి పాల్గొనే ప్రతి క్రీడాకారులను ఆల్ ద బెస్ట్ తెలియజేశారు. క్రీడల్లో జిల్లాను ఎంతో ముందుకు తీసుకెళుతున్నటువంటి కోచ్ లకు అభినందనలు తెలియజేశారు. క్రీడల్లో ఆసక్తి గల ప్రతి ఒక్కరు ఇలాంటి అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. అనంతరం కలెక్టర్ మను చౌదరి పెద్దమ్మ దేవాలయంలో ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. కలెక్టర్ వెంట జిల్లా యువజన, క్రీడా శాఖ అధికారి జయదేవ్ ఆర్య, క్రీడాకారులు, కోచులు తదితరులు పాల్గొన్నారు.