ఇనుప గ్రిల్ కడ్డీలు గుచ్చుకొని వ్యక్తి దుర్మరణం

by Sridhar Babu |
ఇనుప గ్రిల్ కడ్డీలు గుచ్చుకొని వ్యక్తి దుర్మరణం
X

దిశ, ఇటిక్యాల : ఇనుప గ్రిల్ కడ్డీలునోటిలో గుచ్చుకోవడంతో వ్యక్తి మృతి చెందిన ఘటన ఎర్రవల్లి చౌరస్తాలో మంగళవారం చోటు చేసుకొంది. ఇటిక్యాల ఎస్సై వెంకటేష్ తెలిపిన వివరాల ప్రకారం గద్వాల్ మండలం బసాపురం గ్రామానికి చెందిన కోస్గి కృష్ణారెడ్డి (68) కొత్తకోటలో బీఎస్ఎన్ఎల్ లో ఉద్యోగం చేస్తూ 2016 సంవత్సరంలో పదవీ విరమణ పొంది కొత్తకోటలో నివాసం ఉంటున్నాడు. తన సొతం పనుల నిమిత్తం కొత్తకోట నుంచి ఎర్రవల్లికి వచ్చి సర్వీస్ రోడ్డులో మూత్ర విసర్జన చేస్తుండగా ప్రమాదవ శాత్తు ఇనుప గ్రిల్ కడ్డీ నోటిలో గుచ్చుకొని అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుని భార్య లక్ష్మి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై వెంకటేష్ తెలిపారు.

Advertisement

Next Story