- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Mantralayam:పోటాపోటీగా ఇసుక తరలింపు.. పట్టించుకోని అధికారులు
దిశ, మంత్రాలయం: మంత్రాలయంలో రోజు రోజుకు ఇసుకాసురుల అరాచకాలు ఎక్కువ అవుతున్నాయి. ముఖ్యంగా మంత్రాలయం మండల కేంద్రంలో ఇసుకాసురులు యదేచ్చగా తుంగభద్ర నది నుంచి ఇసుకను తోడేస్తున్నారు. మంత్రాలయంలో ఎక్కడ చూసినా ఇసుక డంపులు దర్శనమిస్తున్నాయి. ఇసుకాసురులు యదేచ్చగా ట్రాక్టర్లతో ఇతర ప్రాంతాలకు పోలీస్ స్టేషన్, ఎమ్మార్వో ఆఫీస్ మీదుగా వెళ్తున్నప్పటికీ అధికారులు చూసి చూడనట్టు వ్యవహరించడం, ఎవరైనా అక్రమ ఇసుక రవాణా కు సంబంధించి సమాచారం ఇచ్చినా, హడావుడిగా వాటిని స్వాధీనం చేసుకోవడం, వెనువెంటనే బేరసారాలు కుదుర్చుకొని వాటిని వదిలేయడం, లేదంటే పట్టుకున్న చోటే కూడా ట్రాక్టర్లను యదేచ్చగా వదిలేయడం జరుగుతుండడంతో మంత్రాలయం గ్రామ ప్రజలు ఆగ్రహానికి గురవుతున్నారు. వంకలలో, నదులలో ట్రాక్టర్లతో ఇసుక తోడుకోవడం చట్టరీత్యా నేరం, రీచ్‌ల దగ్గర నుండి మాత్రమే ట్రాక్టర్లతో ఇసుక సరఫరా జరగాలని ప్రభుత్వం నిబంధనలు విధించిన వాటిని బేఖాతరు చేస్తూ, ట్రాక్టర్ యజమానులు యదేచ్ఛగా ఇసుకను తరలిస్తుండడంతో స్థానికులు ఆశ్చర్యానికి గురవుతున్నారు.
ప్రభుత్వ పనుల పేరుతో అనుమతులు తీసుకొని మరీ తరలింపు..
రాష్ట్రంలోని పేదలకు ఇళ్ల నిర్మాణం కోసం ఉచిత ఇసుక విధానాన్ని కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడితే, దాన్ని కొంతమంది పెట్టుబడిదారులు ఉచిత ఇసుక అని ట్రాక్టర్‌కు బ్యానర్ తగిలించుకొని తుంగభద్ర నది నుంచి ఇసుకను తరలిస్తున్నారు. స్థానికంగా ఇల్లు నిర్మించుకునే వారికి మాత్రమే ఎడ్లబండ్లతో వంకలనుండి, నదుల నుంచి తోడుకునే అవకాశం ప్రభుత్వం కల్పించింది. అయితే లాడ్జిలు నిర్మాణాలకు కూడా ఇసుక ట్రాక్టర్లతో డంపు లు ఏర్పాటు చేసుకుని మరీ ఇసుకను నిలువ చేసుకుంటున్నారు. అంతేకాదు కొంతమంది ఏకంగా ఊరు దాటి నియోజకవర్గం దాటి కూడా ఎమ్మిగనూరు లాంటి ప్రాంతాలకు కూడా ఇసుకను మంత్రాలయం తుంగభద్ర నది నుండి తోడేయడం జరుగుతుంది.
పోటా పోటీగా ట్రాక్టర్లతో ఇసుక తరలింపు..
గత వారం రోజులుగా ఇసుకాసురులు తుంగభద్ర నది ఒడ్డున పోటీపడి మరీ ఇసుకను దోచుకెళ్తున్నారు. ఇక్కడి నుండి తీసుకెళ్లిన ఇసుకను ఒక్కో ట్రాక్టర్ 3,000 నుంచి 5000 వరకు బయట ప్రాంతాలకు అమ్ముకొని ఇసుకాసురులు సొమ్ము చేసుకుంటున్నారు. ప్రతిరోజు పదుల సంఖ్యలో ట్రాక్టర్ల ఇసుకను తోడేస్తున్నారు. పోటా పోటీగా ట్రాక్టర్లతో ఇసుక తరలింపు చేస్తున్నారు.అయితే దీనికి సంబంధించి స్థానిక అధికారులు చర్యలు అంతంత మాత్రమే ఉంటున్నాయని ఇప్పటికైనా ఉన్నతాధికారులు చొరవ తీసుకొని ఉచిత ఇసుక విధానానికి తూట్లు పడకుండా ఆపాలని, నిజమైన లబ్దిదారులకు ఉచిత ఇసుక విధానం ఉపయోగపడాలని ప్రజలు కోరుతున్నారు.