Dussehra celebrations: ఘనంగా నవరాత్రి ఉత్సవాలు.. కరెన్సీ నోట్లతో దర్శనమిచ్చిన అమ్మవారు.. ఎక్కడంటే?

by Jakkula Mamatha |   ( Updated:2024-10-08 15:11:51.0  )
Dussehra celebrations: ఘనంగా నవరాత్రి ఉత్సవాలు.. కరెన్సీ నోట్లతో దర్శనమిచ్చిన అమ్మవారు.. ఎక్కడంటే?
X

దిశ,వెబ్‌డెస్క్: రెండు తెలుగు రాష్ట్రాల్లో శరన్నవరాత్రి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ క్రమంలో దుర్గమ్మవారి ఆలయాలను పువ్వులు, రంగు రంగుల విద్యుత్ దీపాలతో ఎంతో ఆకర్షణీయంగా అలంకరించారు. ఇక అమ్మవారి ఆలయాల్లో భక్తులతో సందడి వాతావరణం నెలకొంది. అయితే ఈ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా అమ్మవారు వివిధ రూపాల్లో దర్శనమిస్తున్నారు. వివిధ రూపాల్లో దర్శనమిస్తున్న అమ్మవారిని భక్తులు అధిక సంఖ్యలో దర్శించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఏపీలోని అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో అత్యంత వైభవంగా దసరా నవరాత్రి ఉత్సవాలు జరుగుతున్నాయి. ఈ జిల్లాలోని అమ్మవారు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఆ అమ్మవారిని చూసిన భక్తులు ఆశ్చర్యపోతున్నారు.

కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆలయంలో దేవీ నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఈ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా అమ్మవారు ప్రతి రోజు ఒక్కో అలంకరణలో భక్తులకు దర్శనమిస్తారు అనే విషయం తెలిసిందే. ఈ క్రమంలో నేడు(మంగళవారం) ఆరవ రోజు సందర్భంగా మహాలక్ష్మి అమ్మవారిగా భక్తులకు దర్శనమిచ్చారు. ఇక ఈ అవతారంలో అమ్మవారిని కరెన్సీ నోట్లతో మహాలక్ష్మీదేవిగా అందంగా అలంకరించారు. ఈ అలంకరణ చూపరులను ఆకర్షిస్తోంది. ఈ అలంకరణ కోసం 3 కోట్ల 33 లక్షల కొత్త కరెన్సీ నోట్లు ఉత్సవ కమిటీ ఉపయోగించింది. 50, 100, 200, 500 నోట్లను అమ్మవారి అలంకరణకు వినియోగించారు. అంతేకాదు ఆ ఆలయాన్ని కూడా కరెన్సీ నోట్లతో అందంగా ముస్తాబు చేశారు. అచ్చం పులాకృతిలో ఉండేలా నోట్లను అక్కడ ఏర్పాటు చేశారు. రంగు రంగు పూల మాదిరిగానే కరెన్సీ నోట్లతో అమ్మవారి ఆలయం స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచింది.

Advertisement

Next Story

Most Viewed