- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కేంద్ర హొం మంత్రి అమిత్‌షాను బర్తరఫ్ చేయాలి: ఎస్సీ, ఎస్టీ, బీసీ, ముస్లిం ఫ్రంట్ సంఘాలు
దిశ, రాంనగర్: శనివారం ట్యాంక్ బండ్ అంబేద్కర్ సర్కిల్‌లో పార్లమెంటులో అంబేద్కర్ పై అమిత్ షా చేసిన వాఖ్యాలను నిరసిస్తూ ఎస్సీ, ఎస్టీ, బీసీ, ముస్లిం ఫ్రంట్ సంఘాల ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా. వివిధ సంఘాల నాయకులు మాట్లాడుతూ.. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఅర్.అంబేద్కర్‌ను అవమానపర్చిన కేంద్ర హోంమంత్రి అమిత్ షాను బర్తరఫ్ చేయాలని ఎస్సీ, ఎస్టీ, బిసి, ముస్లిం ఫ్రంట్ డిమాండ్ చేశారు. కేంద్ర మంత్రి పదవి నుంచి అమిత్ షాను తొలగించాలని, క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. అంబేద్కర్ మా దేవుడని. మా దిక్చూచి హక్కుల సూర్యుడని కొనియాడారు. భారత రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని బీజేపీ ఖూనీ చేస్తుందన్నారు. బీజేపీ విద్వేష రాజకీయాలను ఓడించాలన్నారు. ఈ ధర్నాలో వివిధ సంఘాల నాయకులు సలావుల్లాఖాన్, ప్రొఫెసర్ గాలి వినోద్ కుమార్, డి బిఎఫ్ జాతీయ కార్యదర్శి పి.శంకర్, బెడ బుడగ జంగం సంఘం నాయకులు రాంబాబు, అణగారిన కులాల హక్కుల సంఘం నాయకులు సి.ఎల్,యాదగిరి,నర్సింగరావు, తదితరులు పాల్గొన్నారు.