- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
MLC Kavitha : భూభారతి ఒక తిరోగమన చర్య : ఎమ్మెల్సీ కవిత ఫైర్
దిశ, వెబ్ డెస్క్ : భూభారతి(Bhubharati ) చట్టం ఒక తిరోగమన చర్య(Rretrograde Move)అని..భూభారతి భూహారతి అయ్యేటట్లు కనిపిస్తుందని, భూమాత పోర్టల్ భూమేతకే దారి తీస్తుందని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత(MLC Kavitha)ధ్వజమెత్తారు. శాసనమండలిలో భూభారతి బిల్లు చర్చలో కవిత మాట్లాడారు. తెలంగాణ రైతులకు రక్షణ కవచం ధరణి(Dharani)అని...ధరణి వచ్చిన తర్వాత భూమోసాలు ఆగిపోయాయని..ధరణితో ఆటలాడుతున్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని చరిత్ర క్షమించదని..ప్రజలు వెంటబడి మరీ ధరణిని తిరిగి సాధించుకుంటారని కవిత జోస్యం చెప్పారు. బీఆర్ఎస్ పార్టీ అంటే భూ రక్షణ సమితి అని రైతులు, ప్రజలు అనుకుంటున్నారని, భూచట్టాలలో ఏమైనా సమస్యలు వస్తే వాటిని పరిష్కరించుకొని ముందుకెళ్లాలి తప్పా వ్యవస్థనే రద్దు చేయడం సరికాదన్నారు. ధరణిలో కుట్ర కోణం ఉన్నదని ప్రభుత్వం చెప్పడం దారుణమన్నారు. మాతృభూమి కోసం సైనికుడు ప్రాణమిస్తే.. సాగుభూమి కోసం రైతు ప్రాణమిస్తాడని, తెలంగాణలో 2.8 కోట్ల ఎకరాల భూమి ఉందని..అందులో 1.5 కోట్ల ఎకరాలు సాగు భూమి ఉందని, 17.8 లక్షల ఎకరాలు మాత్రమే వివాదాల్లో ఉందని కవిత పేర్కొన్నారు.
గతంలో కౌలుదారులు కేసులు వేస్తే 20-25 ఏళ్ల పాటు రైతులు కోర్టుల చుట్టు తిరిగే పరిస్థితి ఉండేదని, కాబట్టి అన్ని ఆలోచించి కేసీఆర్ రైతుకు మాత్రమే భూమికి యాజమన్య హక్కు ఉండే విధంగా చేశారన్నారు. రైతులకు భూభద్రతను కల్పించిన వ్యక్తి కేసీఆర్ అని, ధరణి వల్ల అనేక భూ సమస్యలు పరిష్కారమయ్యాయని తెలిపారు. దాదాపు 35749 ఉద్యోగులు 100 రోజుల్లో రెవెన్యూ రికార్డులను ప్రక్షాళణ చేశారని, ఆ తర్వాత భూవివరాలను ధరణిలో ఎక్కించారని, ధరణి కన్నా ముందు చార్మినార్ కూడా రిజిస్ట్రేషన్ చేసే పరిస్థితి ఉండేదన్నారు. ధరణితో బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రభుత్వ భూములను కాపాడిందని, ధరణి వచ్చిన తర్వాత ఒక్క గుంట ప్రభుత్వ భూమి కూడా అన్యక్రాంతం కాలేదన్నారు.
భూ రిజిస్ట్రేషన్ల వ్యవస్థను బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజలకు చేరువ చేసిందని, రిజిస్ట్రేషన్, మ్యూటేషన్ ఒకేసారి చేయడం వల్ల 42 నిమిషాల్లో పని పూర్తయ్యేదని, భూమికి సంబంధించి అన్ని పనులు నిమిషాల వ్యవధిలో పూర్తయ్యాయని గుర్తు చేశారు. భూరికార్డుల సరిగ్గా ఉండడం వల్ల భూములు రేట్లు పెరిగాయని, రాష్ట్ర సంపద పెరిగిందన్నారు. మ్యాన్యువల్ పహాణీల వల్ల రాష్ట్రంలో అనేక వివాదాలు ఏర్పడేవని.. ధరణి ఆ సమస్యను తీర్చిందని. భూరికార్డులు, యాజమానుల పేర్లు స్పష్టంగా ఉండడం వల్ల రైతులకు రైతుబంధు అందిందన్నారు. దాదాపు 66 లక్షల మందికి రైతులకు బీఆర్ఎస్ ప్రభుత్వం రైతుబంధు అందించిందని వివరించారు. గతంలో పంట రుణాలు కూడా వచ్చేవి కావని... ధరణి వచ్చిన తర్వాత బ్యాంకులు పంట రుణాలు ఇవ్వడం మొదలుపెట్టాయన్నారు. తద్వారా ప్రైవేటు వడ్డీ వ్యాపారుల నుంచి రైతులు విముక్తయ్యారని, ధరణికి ముందు లక్షలాది మంది ప్రజలు, రైతులు ఇబ్బందులకు గురయ్యారన్నారు.
భూదాన్, అటవీ, ప్రభుత్వం భూములు అన్యక్రాంతం కాకుండా ఉండేందుకు వాటిని పార్ట్-బీలో చేర్చామని, ఎంజాయ్ మెంట్ సర్వే చేయిస్తామని ప్రభుత్వం చెబుతుందని, దీనివల్ల గ్రామాల్లో లేని తగాదాలు మొదలువుతాయన్నారు. మళ్లీ 32 కాలమ్‌లతో పహాణీలను రాయడం ప్రారంభిస్తే మళ్లీ పాత వ్యవస్థ వస్తుందని, రైతుల మధ్య వివాదాలు తలెత్తుతాయని, తద్వారా కేసుల భారం, ఆర్థిక భారం అవుతుందన్నారు. రాష్ట్రమంతా ఒకేసారి కాకుండా.. దశల వారీగా రీసర్వే చేపట్టాలని సూచించారు. ఎవరూ ట్యాంపర్ చేయడానికి వీలు లేకుండా పాస్‌బుక్‌లు ఉన్నాకా.. భూధార్ కార్డు ఎందుకని ప్రశ్నించారు. ఖాతా నెంబరు ఉన్న తర్వాత భూదార్ నెంబరు ఎందుకన్నది ప్రజల్లో అనుమానాలు కలుగుతున్నాయని, ఇప్పటికన్నా ప్రభుత్వం నిజాలు చెప్పాలన్నారు. హైదరాబాద్ చుట్టుముట్టున్న ఆబాదీ భూములపై ప్రభుత్వం పెద్దల కన్ను పడిందని ప్రచారం జరుగుతోందని, భూభారతి వల్ల తప్పు జరిగితే ప్రభుత్వ ఉద్యోగులకు శిక్ష వేస్తామని భయపెట్టడం సరికాదని, భూభారతిలో కౌలుదారులు, అనుభవదారుల కాలమ్ పెట్టే ఆలోచనను విరమించుకోవాలని, కౌలుదారులను వేరే విధంగా ఆదుకోవాలని కవిత సూచించారు.