Instagram: ఇన్‌స్టాగ్రామ్ యూజర్లకు గుడ్ న్యూస్.. త్వరలో కొత్త ఫీచర్ లాంచ్..!

by Maddikunta Saikiran |
Instagram: ఇన్‌స్టాగ్రామ్ యూజర్లకు గుడ్ న్యూస్.. త్వరలో కొత్త ఫీచర్ లాంచ్..!
X

దిశ,వెబ్‌డెస్క్: మెటా(Meta) సంస్థ కు చెందిన ప్రముఖ సోషల్ మీడియా సైట్ ఇన్‌స్టాగ్రామ్ యాప్(Instagram App)ను ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది వినియోగిస్తున్న విషయం తెలిసిందే. అందులో భాగంగా తన యూజర్లను(Users) ఆకట్టుకోవడానికి వాట్సాప్(Whatsapp) తరహాలో ఎప్పటికప్పుడు సరికొత్త ఫీచర్లను అందుబాటులోకి తీసుకొస్తోంది. ఇదిలా ఉంటే.. తాజాగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(AI) ఆధారిత ఎడిటింగ్ ఫీచర్‌ను త్వరలో అందుబాటులోకి తీసుకురాబోతోంది. ఈ విషయాన్ని ఆ సంస్థ హెడ్ ఆడమ్ మొస్సేరి(Adam Mosseri) అధికారికంగా ప్రకటించారు. ఈ మేరకు తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్లో ఓ వీడియో పోస్ట్ చేశారు.

ఈ ఫీచర్ సాయంతో వీడియోల్లో బ్యాక్ గ్రౌండ్(back Ground), ఔట్ ఫిట్స్(Outfits)తో సహా ప్రతీది ఎడిట్(Edit) చేయొచ్చని తెలిపారు. అంటే మీరు ఫోటో లేదా వీడియో వెనుక ఉన్న వివరాలను, బట్టలు, లొకేషన్, ఇతర వస్తువులు మొదలైనవాటిని మార్చవచ్చని, ముఖ్యంగా చెట్లు, పెంపుడు జంతువులు, పూలు వంటి ఫోటోలో లేని కొన్ని వస్తువులను ఈ ఫీచర్ ద్వారా క్రియేట్(Create) చేయవచ్చని పేర్కొన్నారు. ఇందుకోసం టెక్స్ట్(Text) రూపంలో సూచనలు ఇస్తే సరిపోతుందని, ఎడిటింగ్ స్కిల్స్(Editing Skills) వచ్చి ఉండాల్సిన అవసరం లేదని అన్నారు. ఈ ఫీచర్ వచ్చే ఏడాది అందుబాటులోకి వస్తుందని తెలిపారు.

Advertisement

Next Story