- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Russia : రష్యాపై ‘9/11’ తరహా డ్రోన్ దాడి.. ఉక్రెయిన్ ప్రతీకారం
దిశ, నేషనల్ బ్యూరో : అమెరికాలోని న్యూయార్క్‌లో ఉన్న వరల్డ్ ట్రేడ్ సెంటర్‌పై జరిగిన 9/11 ఉగ్రదాడి దృశ్యాలు గుర్తున్నాయా ? అచ్చం అదే తరహాలో రష్యా(Russia)లోని కజాన్(Kazan) నగరంలోని భారీ ఆకాశ హార్మ్యంపై శనివారం డ్రోన్ దాడి జరిగింది. ఈ దాడి ఉక్రెయిన్(Ukraine) ఆర్మీ పనేనని వెల్లడైంది. ఈ సిటీ పరిధిలోని పలు అపార్ట్‌మెంట్లపై ఇదే తరహాలో ఎనిమిది డ్రోన్ దాడులు జరిగాయని తెలిసింది. ఉక్రెయిన్ ప్రయోగించిన చాలా డ్రోన్లను కూల్చేశామని రష్యా అధికార వర్గాలు వెల్లడించాయి.
నివాస సముదాయాలపై జరిగిన డ్రోన్ దాడుల్లో ప్రాణనష్టం సంభవించలేదని తెలిపాయి. ఈ ఘటనల నేపథ్యంలో కజాన్‌లోని విమానాశ్రయాన్ని తాత్కాలికంగా మూసివేశారు. విమానాల రాకపోకలను ఆపేశారు. ఈవివరాలను రష్యా విమానయాన రంగ నియంత్రణ సంస్థ రోసావియాట్సియా వెల్లడించింది. ఇటీవలే 93 క్రూజ్, బాలిస్టిక్ క్షిపణులు, 200కు పైగా డ్రోన్లతో ఉక్రెయిన్‌పై రష్యా దాడులు చేసింది. ఆ దాడులకు ప్రతీకారంగానే ఇప్పుడు డ్రోన్లతో ఉక్రెయిన్ విరుచుకుపడింది. తమ దేశంపై రష్యా దాడులు కొనసాగినన్ని నాళ్లు.. ప్రతీకార దాడులు కూడా ఆగవని ఉక్రెయిన్ తేల్చి చెప్పింది.