- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
శ్రీధర్ బాబు vs ఏలేటి.. ఆ వ్యాఖ్యలు తొలగిస్తామని స్పీకర్ హామీ
దిశ, తెలంగాణ బ్యూరో: అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా మన్మోహన్ సింగ్ సంతాప తీర్మానం సమయంలో బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి వర్సెస్ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నట్లుగా సాగింది. తొలుత సభలో ఏలేటి మహేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ.. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ సేవలను దేశ ప్రజలు మర్చిపోలేరని వ్యాఖ్యానించారు. మన్మోహన్ సింగ్ స్మారక చిహ్నం కోసం కేంద్ర ప్రభుత్వం స్థలం కేటాయించనుందన్నారు. కానీ కాంగ్రెస్ మాత్రం పీవీ నరసింహరావుకు స్మారక స్థలాన్ని కేటాయించలేదని విమర్శలు చేశారు. పీవీకి మోడీ ప్రభుత్వం భారతరత్న అందించిందని, ఆ కార్యక్రమానికి కూడా సోనియా గాంధీ కుటుంబం హాజరుకాలేదని గుర్తుచేశారు. దీన్నిబట్టి చూస్తే పీవీకి కాంగ్రెస్ ఎంత గౌరవం ఇచ్చిందో అర్థం చేసుకోవచ్చని మండిపడ్డారు. మన్మోహన్ సింగ్ సంతాపదినాలు పాటిస్తున్న సమయంలో న్యూ ఇయర్ వేడుకల కోసం రాహుల్ గాంధీ వియత్నాంకు వెళ్లారని ఏలేటి విమర్శలు చేశారు.
కాగా.. ఆయన వ్యాఖ్యలపై శాసనసభ వ్యవహారాల మంత్రి శ్రీధర్ బాబు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇది సంతాప సభ మాత్రమేనని పేర్కొన్నారు. ఇక్కడ రాజకీయాలు మాట్లాడకూడదని సూచించారు. రాజకీయాలు మాట్లాడేందుకు చాలా వేదికలు ఉన్నాయని శ్రీధర్ బాబు పేర్కొన్నారు. ఈనేపథ్యంలో మహేశ్వర్ రెడ్డి వ్యాఖ్యలను రికార్డ్స్ నుంచి తొలగిస్తామని స్పీకర్ సభలో అనౌన్స్ చేశారు. ఆపై మళ్లీ మాట్లాడిన ఏలేటి రాహుల్ వియత్నాం టూర్ ను ప్రస్తావించడంతో ఆయన స్పీచ్ ను మంత్రి పొన్నం అడ్డుకున్నారు. అయినా ఏలేటి అలాగే కొనసాగించారు. మన్మోహన్ సింగ్ కు ఉన్నంత ప్రాధాన్యత పీవీకి కాంగ్రెస్ ఎందుకివ్వలేదని ప్రశ్నించారు. పీవీకి గుర్తుగా ఆయన విగ్రహం ఏర్పాటుచేయాలని ఏలేటి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.