- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
మీ బిడ్డ పదిలో…ఉత్తమ ఫలితం సాధించాలి
దిశ, సిద్దిపేట ప్రతినిధి : ఈ ప్రపంచంలో 'హాని' కలిగించని వ్యసనం ఏదైనా ఉందంటే అది చదువు మాత్రమేనని ఎంత చదివితే అంత సత్ప్రయోజనం చేకూర్చగలిగే ఔషధం కూడా చదువే అని ఇలాంటి చదువును నమ్ముకున్న వారంతా తమ ఉజ్వల భవిష్యత్తుకు బాటలు వేసుకున్నారన్నారు. నిరుపేద కుటుంబాల్లో జన్మించి దేశాలను పాలించే స్థాయికి ఎదిగిన వారు కొందరైతే.. నేటి సాంకేతిక యుగానికి సంస్కరణలు రచించినవారు ఇంకెందరో ఉన్నారని.. ప్రణాళికాబద్ధమైన చదువు మన తలరాతనే మారుస్తుందనడానికి ఎన్నో సజీవసాక్ష్యాలు ఉన్నాయని మాజీ మంత్రి, ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావు ఉత్తరం లో పేర్కొన్నారు. తల్లి తండ్రులకు మనోధైర్యం... విద్యార్థులకు ఆత్మవిశ్వాసం నింపేలా ఎమ్మెల్యే హరీష్ రావు ఉత్తరోపదేశం చేశారు. మరి కొద్ది రోజుల్లోనే మీ పిల్లలు పదో తరగతి పరీక్షలు రాయబోతున్నారు.
వారి చదువులో ఇది అత్యంత కీలకమైన ఘట్టం. ఇది మంచి మార్కులతో గట్టెక్కితేనే ఉన్నత చదువుల దిశగా ముందడుగు వేసే అవకాశం ఉంటుంది. లేదంటే మీరు ఇన్నాళ్లు పడిన కష్టానికి, మీ పిల్లల చదువుకు ఎలాంటి అర్థం ఉండదన్నారు. మీ పిల్లలు తమ చదువుల్లో విజయం సాదించాక మీరు ఇచ్చే అభినందన కన్నా మీ పిల్లలు పరీక్షలు వ్రాసే ముందు మీరు తీసుకొనే ప్రత్యేక శ్రద్ద ఎంతో ముఖ్యమని చెప్పారు. అందుకే వార్షిక పరీక్షలు ముగిసేదాకా పిల్లలపై ధృష్టి పెట్టాలని అన్నారు. ముఖ్యంగా సెల్ ఫోన్లకు దూరంగా ఉంచండి. విందులు, వినోదాలు, ఫంక్షన్లు, సినిమాలు, టీవీల జోలికి వెళ్లకుండా చూడండి. మీ ఇంటికి సంబంధించిన పనులను కూడా చెప్పవద్దని కోరారు. ఈ పోటీ ప్రపంచంలో సాదాసీదాగా కాకుండా ప్రతిభను చాటితేనే మంచి అవకాశాలు వస్తున్నాయని అన్నారు.
గత నాలుగేళ్లుగా సిద్దిపేట నియోజకవర్గంలో చదివిన పదో తరగతి విద్యార్థులంతా అత్యధిక మార్కులు సాధిస్తున్నారన్నారు. నూటికి నూరు శాతం పాసవుతున్నారు. ప్రతిష్టాత్మకమైన బాసర ట్రిపుల్ ఐటీ విద్యాసంస్థలోనూ 169 మంది సిద్దిపేట నియోజకవర్గ విద్యార్థులు గత ఏడాది సీట్లు సాధించడం గర్వకారణమని.. ఉచిత ఇంజనీరింగ్ విద్యతోపాటు మంచి ఉద్యోగాలను దక్కించుకుంటున్నారు. మీ పిల్లలు మంచి మార్కులతో పాస్ కావలనేదే నా ఆకాంక్ష.నా తపన అని పేర్కొన్నారు. నా వంతుగా ప్రభుత్వ పాఠశాలల్లో ప్రత్యేక తరగతులతో పాటు అల్పాహారం ఏర్పాటు చేస్తున్నాను. జిల్లా విద్యాధికారి నుంచి మీ పిల్లలకు చదువు చెప్పే ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులతో కూడా సమీక్షలు నిర్వహిస్తున్నానని చెప్పారు.
వారి స్కూళ్లలో సౌకర్యాలు కల్పించడం జరిగింది. ఒక్క మార్కు కూడా తగ్గకుండా డిజిటల్ కంటెంట్ ద్వారా ప్రతీ సబ్జెక్టుపై అవగాహన కల్పిస్తున్నాం. అన్ని రంగాల్లో ఆదర్శంగా నిలిచిన మన సిద్దిపేట నియోజకవర్గ విద్యార్థులు పదో తరగతి ఫలితాల్లో కూడా ఆదర్శంగా నిలవాలనేదే నా తాపత్రయం అన్నారు. ప్రజాప్రతినిధిగా, మీ కుటుంబంలో ఒకడిగా నా వంతు ప్రయత్నం నేను చేస్తున్నాను. మీరు కూడా మీ పిల్లలను బాగా చదివించండి. చదువుతోపాటు చేతిరాత చక్కగా ఉండేలా చూడండి. ఇక మీ పిల్లల భవిష్యత్తు మీ చేతుల్లోనే ఉందని ఉత్తరం లో పేర్కొన్నారు. కష్టంగా కాకుండా ఇష్టం గా చదివించాలని, మీ పిల్లల బంగారు భవితకు బాటలు వేయాలని ఉత్తరం ద్వారా చైతన్యం తెచ్చారు.