ISRO: శ్రీహరికోటలో ఇస్రో శాస్త్రవేత్తల సంబరాలు

by Gantepaka Srikanth |
ISRO: శ్రీహరికోటలో ఇస్రో శాస్త్రవేత్తల సంబరాలు
X

దిశ, వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీహరికోట(Sriharikota)లో ఇస్రో శాస్త్రవేత్తలు(ISRO scientists) సంబురాలు చేసుకున్నారు. సోమవారం రాత్రి 10 గంటల 15 సెకన్ల సమయంలో ప్రవేశపెట్టిన PSLV C-60 రాకెట్ ప్రయోగం విజయవంతం కావడంతో స్వీట్లు పంచుకుని ఒకరికొకరు శుభాకాంక్షలు చెప్పుకున్నారు. నిర్దేశిత కక్షలోకి ఉపగ్రహాలను ప్రవేశపెట్టారు. ఈ ప్రయోగం విజయవంతం కావడంతో స్పేస్ డాకింగ్ టెక్నాలజీ(Space Docking Technology)ని సాధించిన నాలుగో దేశంగా భారత్‌కు అరుదైన ఘనత దక్కింది. భవిష్యత్తులో మరిన్ని కీలక ప్రయోగాలకు నాంది అవుతుందని శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు.

అంతరిక్షం(Space)లో స్పేస్ స్టేషన్ ఏర్పాటుతోపాటు ఇతర ప్రయోగాలకు మార్గదర్శనం చేయడానికి స్పేస్ డాకింగ్ టెక్నాలజీ ఉపయోగపడనుంది. ఈ సందర్భంగా ఇస్రో చైర్మన్ సోమనాథ్(Somnath) మాట్లాడుతూ.. డాకింగ్ ప్రక్రియకు మరో వారం పడుతుందని సోమనాథ్ స్పష్టం చేశారు. ఇక డాకింగ్‌ ప్రక్రియ పూర్తయితే ఈ సాంకేతికతను కలిగిన నాలుగో దేశంగా భారత్‌ నిలవనుంది. ఇప్పటికే అమెరికా, రష్యా, చైనా దేశాలు ఈ సాంకేతికతను కలిగి ఉన్నాయి.

Next Story

Most Viewed