- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Baby Massage: వింటర్‌లో మీ బిడ్డకు మసాజ్ చేస్తున్నారా..? ఈ విషయాలు తెలుసుకోండి!
దిశ, వెబ్‌డెస్క్: చిన్నపిల్లల(Childrens) విషయంలో తల్లిదండ్రులు(parents) చాలా జాగ్రత్తగా ఉంటారు. పిల్లలు హెల్తీగా ఉండేందుకు వైద్యుల్ని ఏం ఫుడ్ పెట్టాలంటూ పలు సలహాలు కూడా అడిగి తెలుసుకుంటారు. అయితే పిల్లల ఆరోగ్యం కోసం కేవలం నాణ్యమైన ఆహారమివ్వడమే కాకుండా.. మసాజ్(Massage) కూడా ముఖ్యమే అంటున్నారు వైద్య నిపుణులు. మసాజ్ వల్ల పిల్లల బాడీ రిలాక్స్(Relax body)గా ఉంటుంది. అంతేకాకుండా వారి ఎదుగుదలకు కూడా కారణమయ్యేందుకు సహాయపడుతుంది.
మరీ చలికాలంలో వాతావరణం కాస్త కూల్‌గా ఉంటుంది కదా.. పిల్లలకు మసాజ్ చేయొచ్చా? లేదా? మసాజ్ వల్ల పిల్లలకు జలుబు(cold) వంటి సమస్యలేమైనా తలెత్తుతాయా? అని చాలా మందిలో సందేహాలు వస్తూ ఉంటాయి. అయితే ఎలాంటి డౌట్ లేకుండా వింటర్‌లో కూడా పిల్లలకు మసాజ్ చేయొచ్చునని తాజాగా గైనకాలజిస్ట్‌లు(Gynecologists) చెబుతున్నారు. కానీ పలు జాగ్రత్తలు తీసుకుంటే బిడ్డ మరింత హెల్తీగా తయారవుతుందని సూచిస్తున్నారు.
శీతాకాలంలో పిల్లలకు మసాజ్ చేసే ముందు ఆయిల్ వేడి చేయాలి. గోరు వెచ్చని ఆయిల్‌తో బీబికి మసాబ్ చేస్తే వెదర్ చల్లగా ఉన్నా కూడా పిల్లలకు కోల్డ్ కాదు. అలాగే చలి బాగా ఉన్నట్లైతే.. మసాజ్ చేసేటప్పుడు పిల్లల బట్టలు తొలగించకపోవడమే మంచిది. అలాగే ఫ్యాన్స్ ఆఫ్ చేయాలి. ప్లాస్టిక్ లేదా కాటన్ షీట్లపై పిల్లల్ని పడుకోబెట్టవద్దు. ఇక ఈ బేబీ మసాజ్ వల్ల లాభాలు చూసినట్లైతే..
పిల్లలకు మసాజ్ చేస్తే.. వారి మనసుకు అండ్ బాడీకి బోలెడు ప్రయోజనాలున్నాయి. బ్లడ్ సర్కులేషన్(Blood circulation) సాఫీగా జరుగుతుంది. అలాగే ఎముకలు దృఢంగా(Bones strong) తయారవుతాయి. శరీర కదలికలకు సహాయం చేస్తుంది. మసాజ్ వల్ల నరాల ఆరోగ్యం(Nerve health) మెరుగుపడుతుంది. అంతేకాకుండా శరీర ఆకృతి(body shape) హెల్తీగా, బలంగా తయారవుతుంది. పిల్లలకు మసాజ్ చేస్తే హ్యాపీగా నిద్రపోవడమే కాకుండా వారి చర్మం మృదువుగా మారుతుంది. అలాగే చర్మ వ్యాధులు(Skin diseases), స్ట్రెస్(Stress), ఇన్ఫెక్షన్ల(infections) బారిన పడకుండా మేలు చేస్తుంది.
Read More...
మంచి తల్లి అవ్వాలంటే పిల్లల కోరికలన్నింటినీ నెరవేర్చడమే కాదు..!!