భూపాలపల్లి జిల్లా జ్యూడిషల్ ఎంప్లాయిస్ అసోసియేషన్ కమిటీ ఎన్నిక

by Aamani |
భూపాలపల్లి జిల్లా జ్యూడిషల్ ఎంప్లాయిస్ అసోసియేషన్ కమిటీ ఎన్నిక
X

దిశ, కాటారం : న్యాయ వ్యవస్థకి ఉద్యోగులే అవయవాల లాంటివారు అని జిల్లా ప్రధాన న్యాయమూర్తి పి. నారాయణ బాబు అన్నారు. శరీరం బాగుండాలంటే అవయవాలు అన్ని బాగుండాలి, అలాగే న్యాయ వ్యవస్థ బాగుండాలంటే ఉద్యోగులు అందరూ బాగుండాలని జయశంకర్ భూపాలపల్లి జిల్లా ప్రధాన న్యాయమూర్తి పి. నారాయణ బాబు అన్నారు. అసోసియేషన్ కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. నూతనంగా ఎన్నికైన అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శి మరియు కార్యవర్గ సభ్యులు అందరిని జిల్లా ప్రధాన న్యాయమూర్తి అభినందించారు.

ఎన్నికల అధికారిగా శ్రీమతి జి. అనిత వాని వ్యవహరించగా, జ్యూడిషల్ ఎంప్లాయిస్ అసోసియేషన్ ఆల్ ఇండియా సెక్రటరీ కుమ్మరి జగన్నాథం ఎన్నికైన వారికి నియామక పత్రాలు అందజేశారు. అధ్యక్షులుగా ఒళ్లాల సదానందం, ప్రధాన కార్యదర్శిగా పాలకుర్తి సాయి చరణ్, ట్రెజరర్ గా కే. స్వప్న, గౌరవ అధ్యక్షులుగా శ్రీమతి జి. అనితవాని, అసోసియేట్ ప్రెసిడెంట్ గా జి. అనిత, ఉపాధ్యక్షులుగా వి. శాంత, టి. రజిత, కే. జగదీశ్వర్ రెడ్డి, ఆర్గనైజింగ్ సెక్రటరీ గా కే. శ్రీకాంత్, జాయింట్ సెక్రటరీ లుగా ఎన్. శ్రీజ, సిహెచ్. కరుణ శ్రీ, సఫ్ఫాన్, లేడీ రెప్రెసెంటివ్ గా బి. ప్రతిమ, స్పోర్ట్స్ సెక్రటరీ గా ఎస్. బన్సీ వైష్ణవి, ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ గా జి. శివ, సిహెచ్. అనూష, రఘువీర్, బి. ప్రసూన, డి. సౌజన్య, ఆర్. చైతన్య, బి. దీపిక రాథోడ్, పి. రజిత లు ఎన్నికయ్యారు.

Advertisement

Next Story