త్వరలో జిల్లాకు ఒక మహిళా శక్తి ఫిష్ ట్రక్

by Mahesh |
త్వరలో జిల్లాకు ఒక మహిళా శక్తి ఫిష్ ట్రక్
X

దిశ, తెలంగాణ బ్యూరో: ప్రజా ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి మహిళలను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు వినూత్న కార్యక్రమాలను తీసుకొస్తుంది. వారితో వివిధ వ్యాపారాలు చేయించేలా శిక్షణ ఇప్పిస్తూ వారి సమగ్ర అభివృద్ధిని కాంక్షిస్తుంది. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరా మహిళా శక్తి కార్యక్రమంలో భాగంగా సంచార చేపల విక్రయ వాహనాలను మహిళా సంఘాల కోసం పంచాయతీ గ్రామీణాభివృద్ధి, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క ఆదేశాలతో గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్) సిద్ధం చేస్తోంది.

జిల్లాకు ఒక్కటి చొప్పున 32 వాహనాలు

జిల్లాకు ఒకటి చొప్పున మొత్తం 32 వాహనాలను మహిళా సంఘాల కోసం ప్రత్యేకంగా తయారు చేస్తున్నారు. రూ. 10 లక్షల విలువ గల ఈ వాహనాలను కేంద్ర ప్రభుత్వ ప్రధానమంత్రి మత్స్య యోజన పథకంతో అనుసంధానం చేసి.. 60 శాతం సబ్సిడీతో నాలుగు లక్షల రూపాయలకే మహిళా సంఘాలకు కేటాయించనున్నారు. ఈ నాలుగు లక్షల రూపాయలను సైతం గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్) బ్యాంకుల నుంచి వడ్డీ లేని రుణాలను ఇప్పించనుంది. ఇప్పటికే, ఇందిరా మహిళా శక్తి కార్యక్రమంలో భాగంగా ఇందిరా మహిళా బజార్ లను ఏర్పాటు చేసి గ్రామీణా ప్రాంతాల ఉత్పత్తులను విక్రమయించేలా ప్రోత్సాహాన్ని అందిస్తుంది.

సంచార చేపల విక్రయం కోసం మహిళలకు శిక్షణ

సంచార చేపల విక్రయం కోసం మహిళలకు అవసరమైన శిక్షణను గచ్చిబౌలిలోని నిథం ఇనిస్టిట్యూట్లో మహిళా సంఘాలకు సెర్ఫ్ ఆధ్వర్యంలో ఇప్పించారు. చేపల విక్రయంతో పాటు నోరూరించే చేపల వంటకాల తయారీకి అవసరమైన మెళకువలను పలు మహిళా సంఘాలు పూర్తి చేసుకున్నాయి.ఈ సంచార చేపల విక్రయ వాహనంలో ఉదయం చేపలను విక్రయించేలా, సాయంత్రం చేపల వంటకాలను తయారు చేసి విక్రయించే విధంగా వాహనాలను ప్రత్యేకంగా తయారు చేయించారు. జనవరి 3,న ఈ 32 వాహనాలను మంత్రి సీతక్క ప్రారంభించనున్నారు. 3,న ఈ 32 వాహనాలను మంత్రి సీతక్క ప్రారంభించనున్నారు.

Advertisement

Next Story