సమంత రియల్ హీరో.. ‘జిగ్రా’ ఈవెంట్‌లో ఆలియా కామెంట్స్

by sudharani |   ( Updated:2024-10-08 14:44:47.0  )
సమంత రియల్ హీరో.. ‘జిగ్రా’ ఈవెంట్‌లో ఆలియా కామెంట్స్
X

దిశ, సినిమా: ఆలియా భ‌ట్, వేదాంగ్ రైనా ప్రధాన పాత్రల్లో న‌టించిన చిత్రం ‘జిగ్రా’. ఈ మూవీ అక్టోబర్ 11న రిలీజ్ కాబోతోంది. ‘జిగ్రా’ చిత్రాన్ని తెలుగులో ఏషియ‌న్ సురేష్‌ ఎంట‌ర్‌టైన్‌మెంట్‌పై రానా విడుద‌ల చేస్తున్నారు. పాన్ ఇండియా డైరెక్టర్ ఎస్‌.ఎస్‌.రాజ‌మౌళి, గ్లోబ‌ల్ స్టార్ రామ్‌చ‌ర‌ణ్‌లు విడుద‌ల చేసిన జిగ్రా తెలుగు ట్రైలర్ అందరినీ ఆకట్టుకుంది. మంగళవారం నాడు ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను గ్రాండ్‌గా నిర్వహించారు. ఈ ఈవెంట్‌కు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్, రానా దగ్గుబాటి, సమంతలు ముఖ్య అథితులుగా విచ్చేశారు. త్రివిక్రమ్, సమంత చేతుల మీదుగా బిగ్ టికెట్ లాంచ్ చేశారు.

ఈ సందర్బంగా ఆలియా భట్ మాట్లాడుతూ.. ‘నేను మెసెజ్ చేసిన వెంటనే వచ్చిన త్రివిక్రమ్ గారికి థాంక్స్. మీరు మాట్లాడిన ప్రతీ మాట గుండెల్ని తాకింది. ఆన్ స్క్రీన్, ఆఫ్ స్క్రీన్‌లో సమంత రియల్ హీరో. సమంత తన నటనతో సినిమా పరిశ్రమలో నిలబడ్డారు. సమంతకు, నాకు సరిపోయే కథను త్రివిక్రమ్ రాస్తే బాగుంటుందనిపిస్తోంది. మంచి చిత్రాన్ని ప్రేమించడం, ఆదరించడంలో తెలుగు ప్రేక్షకులు ఎప్పుడూ ముందుంటారు. అందుకే నా గంగూభాయ్, బ్రహ్మాస్త్ర సినిమాను తెలుగులో రిలీజ్ చేశాం. ఇక ‘జిగ్రా’ సినిమాను తెలుగులోకి తీసుకొస్తున్న రానాకి థాంక్స్. అక్టోబర్ 11న మా చిత్రం రాబోతోంది. యాక్షన్, డ్రామా, ఎమోషన్ ఇలా అన్నీ ఉన్న ఓ ఇంటెన్స్ సినిమా. అందరూ చూసి సక్సెస్ చేయాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు.

త్రివిక్రమ్ మాట్లాడుతూ.. ‘నాకు ఇష్టమైన ఇద్దరు హీరోయిన్లు ఆలియా, సమంత గారు ఇక్కడే ఉన్నారు. రజినీకాంత్ గారికి అన్ని భాషల్లో ఫ్యాన్స్ ఉన్నారు. ఆ తర్వాత సమంత గారికే ఉన్నారనిపిస్తుంది. జిగ్రా ట్రైలర్ చూస్తే.. థియేటర్‌కు వచ్చి సినిమా చూడు అని పిలిచినట్టుగా అనిపించింది. జిగ్రా కోసం ఆలియా ఎంత కష్టపడ్డారో ట్రైలర్ చూస్తే అర్థం అవుతోంది. ఈ మూవీ కోసం ఫిజికల్‌గానూ కష్టపడ్డారు. కొన్ని సార్లు ట్రైలర్ చూస్తేనే సినిమా సూపర్ హిట్ అని చెప్పొచ్చు. సమంత సెట్‌లో ఓ డైనమేట్‌‌లా ఉంటుంది. ఈ ఈవెంట్‌లో ఆలియాని చూస్తే కూడా డైనమేట్‌లా అనిపించారు. అక్టోబర్ 11న ఈ చిత్రం రాబోతోంది. అందరూ చూడండి’ అని అన్నారు.

సమంత మాట్లాడుతూ.. ‘ఆలియా నటన అంటే నాకు చాలా ఇష్టం. హీరోయిన్లుగా మాపై కొంత బాధ్యత ఉంటుంది. అమ్మాయిలు వారి జీవితాలకు వాళ్లే హీరోలు అని చెప్పేందుకు అప్పుడప్పుడు ఇలాంటి కథలు చెప్పాల్సి వస్తుంది. ఆలియా ఒకవైపు నటిస్తూనే.. మరో వైపు సినిమాలు నిర్మిస్తూ ఉన్నారు. రాహుల్‌తో 15 ఏళ్ల బంధం.. త్రివిక్రమ్ గారెతో మూడు చిత్రాలు చేశాను. సురేశ్ ప్రొడక్షన్స్ నుంచి నాకు మంచి చిత్రాలు వచ్చాయి. వీళ్లంతా నా జిగ్రాలు. ఈ చిత్రం పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. రానా గత నెలలోనే ఓ ఫీమేల్ ఓరియెంటెడ్ చిత్రాన్ని ఇచ్చారు. ఇప్పుడు జిగ్రాను ఇస్తున్నారు. ప్రతీ అమ్మాయికి రానా లాంటి బ్రదర్ ఉండాలి. తెలుగు ప్రేక్షకులు ఎంతగా ప్రేమిస్తారు అనేది జిగ్రాతో ఆలియాకు మరింత తెలుస్తుంది. తెలుగు ప్రేక్షకులు ప్రేమ వల్లే నేను ఈ రోజు ఇలా ఈ స్థాయిలో ఉన్నాను. అక్టోబర్ 11న ఈ చిత్రాన్ని అందరూ చూడండి’ అని అన్నారు.

Advertisement

Next Story

Most Viewed