ఓలాకు మరిన్ని చిక్కులు తప్పవా?

by M.Rajitha |
ఓలాకు మరిన్ని చిక్కులు తప్పవా?
X

దిశ, వెబ్ డెస్క్ : ప్రముఖ టూ వీలర్ విద్యుత్ వాహన తయారీ సంస్థ ఓలా(Ola)కు మరిన్ని సమస్యలు ఎదురవనున్నాయి. కేంద్ర రవాణాశాఖ వర్గాల సమాచారం ప్రకారం.. వాహనదారుల ఫిర్యాదులపై సంస్థ స్పందన, సేవలపై రవాణాశాఖ విచారణకు ఆదేశించనున్నట్టు తెలుస్తోంది. మరి కొద్ది రోజుల్లోనే ప్రాథమిక దర్యాప్తు చేపట్టడంతోపాటు, ఓలా నుండి సమగ్ర నివేదికను కోరనుంది. కాగా వినియోగదారులను మోసగించే ప్రకటనలు, హక్కుల ఉల్లంఘన, అన్యాయమైన వ్యాపార పద్ధతులు అనుసరిస్తుందని ఇప్పటికే సెంట్రల్ కన్జ్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీ(CCPA) ఓలా విద్యుత్ వాహన తయారు సంస్థకు షోకాజ్ నోటీసులు అందజేసింది. దీనిపై 15 రోజుల్లో వివరణ ఇవ్వాలని సీసీపీఎ కోరగా.. ఈసారి స్వయంగా రవాణా శాఖ రంగంలోకి దిగనుందని తెలుస్తోంది. ఈ వ్యవహారం వలన కంపెనీ షేర్లు కాస్త క్షీణించాయి.

Advertisement

Next Story

Most Viewed