Sadness is also good: దుఃఖమూ మంచిదే.. బాధలు, భావోద్వేగాలు, కన్నీళ్లతో ఆరోగ్యం !

by Javid Pasha |
Sadness is also good: దుఃఖమూ మంచిదే.. బాధలు, భావోద్వేగాలు, కన్నీళ్లతో ఆరోగ్యం !
X

దిశ, ఫీచర్స్ : నవ్వు ఆరోగ్యానికి మంచిదనే విషయం మనకు తెలిసిందే. కానీ అప్పుడప్పుడు గుండెలోతుల్లోంచి పెల్లుబికే నిజమైన బాధ, భావోద్వేగం, దుఃఖం, కన్నీళ్లు కూడా మనకు మేలు చేస్తాయని నిపుణులు అంటున్నారు. ఆ సందర్బాన్ని మనసారా ఫీల్ అవ్వడంవల్ల వాటి తాలూకు సమస్యల నుంచి బయటపడేందుకు అవసరమైన రసాయనిక చర్యలు శరీరంలో జరుగుతాయని, దీంతో దుఃఖ్కాన్ని అధిగమించగలుగుతామని మానసిక నిపుణులు పేర్కొంటున్నారు.

ఏదైనా దుఃఖం వచ్చే సందర్భం ఎదురైతే.. మనసులో బాధగా అనిపించి కళ్లు చెమ్మగిల్లుతుంటే.. ఆ భావోద్వేగాన్ని బలవంతంగా అణచే ప్రయత్నం మాత్రం చేయవద్దనేది నిపుణుల సలహా. ఎందుకంటే ఆ సమయంలో మీరు పెట్టుకునే కన్నీళ్లే మీ మనసును తేలిక పరుస్తాయంటున్నారు. నిజానికి దుఃఖంలోంచి వచ్చిన కన్నీళ్లు శరీరంలో పారాసింపథెటిక్ నాడీ వ్యవస్థను యాక్టివేట్ చేస్తాయని, దీనివల్ల మనసును తేలికపరిచే ఎండార్ఫిన్(Endorphins) హార్మోన్లు విడుదలవుతాయని నిపుణులు చెప్తున్నారు. అందుకే అది ఎంతటి బాధ అయినా, భావోద్వేగమైనా మనసు తేలిక పడుతుంది. అలాగే నిరాశ, నిస్పృహ, ఒత్తిడి, ఆందోళన, డిప్రెషన్ వంటి సమస్యల నుంచి బయటపడతారని నిపుణులు చెప్తున్నారు. అలా కాకుండా బాధలు, భావోద్వేగాలు, దుఃఖాన్ని కలిగించే భావాలను బలవంతంగా అణచివేస్తే మాత్రం ఒత్తిడి, ఆందోళన ఎక్కువైపోతాయి. ఆరోగ్యంపరంగానూ నష్టం జరుగుతుంది.

Advertisement

Next Story

Most Viewed