మహాలక్ష్మి అవతారంలో వర్గల్ విద్యాధరి

by Aamani |
మహాలక్ష్మి అవతారంలో వర్గల్ విద్యాధరి
X

దిశ,వర్గల్: అత్యంత శక్తివంతమైన శరన్నవరాత్ర పర్వదినాల సందర్భంగా శ్రీ మహాలక్ష్మి అవతారంలో ఉన్న జ్ఞాన ప్రదాయిని శ్రీ విద్యాధరి అమ్మవారిని దర్శిస్తే సకల సంపదలు సమకూరుతాయని వర్గల్ క్షేత్ర వ్యవస్థాపకుడు, బ్రహ్మశ్రీ, యాయవరం చంద్రశేఖర శర్మ సిద్ధాంతి పేర్కొన్నారు. మంగళవారం తెల్లవారుజామున వేదమూర్తులైన బ్రాహ్మణోత్తములు మంత్రోశ్చరణల మధ్య క్షేత్రంలో గణపతి పూజ తో ప్రారంభమై పుణ్యాహవాచనం, మహాభిషేకం, కలశ స్థాపన, చతుషష్టి ప్రచార పూజ, మూలమంత్ర హవనము, చండీ హోమము, చిన్నారులకు అక్షరాభ్యాసాలు, అన్నప్రాసన తదితర కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. అనంతరం సిద్ధాంతి చంద్రశేఖర శర్మ మాట్లాడుతూ ఆది పరాశక్తి, జగన్మాత శ్రీ అమ్మవారిని మనస్ఫూర్తిగా అర్చిస్తే సంపూర్ణ అనుగ్రహం ప్రాప్తిస్తుందని, శ్రీలక్ష్మి దేవి, శ్రీ విద్యా సరస్వతి, శ్రీ దుర్గా మాత దేవతలు వేర్వేరు అస్తిత్వాలు కాదని, ఏక వచన దైవత్వం యొక్క విభిన్న రూపాలని స్పష్టం చేశారు. దీనిని దృష్టిలో పెట్టుకొని అమ్మవారిని సేమిస్తే ఆ కుటుంబానికి అంతా మంచే జరుగుతుందని వివరించారు.

అమ్మవారిని దర్శించుకున్న మెదక్ ఎంపీ రఘునందన్ రావు

మెదక్ ఎంపీ రఘునందన్ రావు క్షేత్రంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా సిద్ధాంతి చంద్రశేఖర శర్మ నేతృత్వంలో వేద పండితులు ఆయనకు తీర్థప్రసాదాలు అందజేసి శేష వస్త్రం తో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో గురువా రెడ్డి, మండల అధ్యక్షుడు బాల్ రెడ్డి, టేకులపల్లి రాం రెడ్డి, నాగరాజు తదితరులు నాయకులు పాల్గొన్నారు.



Advertisement

Next Story

Most Viewed