- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
Tirumala: తిరుమలలో భారీగా పెరిగిన రద్దీ.. శ్రీవారి సేవలో రఘురామ..
దిశ, వెబ్ డెస్క్: తిరుమల (Tirumala)లో భక్తుల రద్దీ భారీగా పెరిగింది. నాలుగు రోజులుగా తుపాను హెచ్చరికల నేపథ్యంలో తగ్గిన రద్దీ.. నేడు పెరిగింది. వారాంతం కూడా కావడంతో.. భక్తులు తిరుమలకు క్యూ కడుతున్నారు. ప్రస్తుతం 25 కంపార్టుమెంట్లలో భక్తులు దర్శనం కోసం వేచి ఉండగా.. టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వ దర్శనానికి 13 గంటల సమయం పడుతుందని టీటీడీ (TTD) అధికారులు వెల్లడించారు.
నిన్న (గురువారం) స్వామివారిని 56,952 మంది భక్తులు దర్శించుకోగా.. 21,714 మంది భక్తులు తలనీలాల మొక్కులు చెల్లించుకున్నారు. వివిధ కానుకల రూపంలో స్వామివారి హుండీ ఆదాయం రూ.3.84 కోట్లు వచ్చినట్లు టీటీడీ పేర్కొంది.
ఏపీ డిప్యూటీ స్పీకర్, ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు (Deputy Speaker Raghurama Krishnaraju) శ్రీవారిని దర్శించుకున్నారు. వీఐపీ బ్రేక్ దర్శన సమయంలో శ్రీవారి సేవలో పాల్గొన్నారు. స్వామివారికి నిర్వహించే అభిషేక సేవలో పాల్గొన్న అనంతరం.. వేద పండితులు తీర్థ ప్రసాదాలు అందజేశారు.