- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
వివాదాస్పద దక్షిణ చైనా సముద్రంలో నాలుగు దేశాల నావిక, వైమానిక విన్యాసాలు
దిశ, నేషనల్ బ్యూరో: వివాదాస్పద దక్షిణ చైనా సముద్రంలో అమెరికా, ఆస్ట్రేలియా, జపాన్, ఫిలిప్పీన్స్ దేశాలు కలిసి సంయుక్తంగా నావికా, వైమానిక విన్యాసాలను ఆదివారం నిర్వహించనున్నాయి. ఈ ప్రాంతంలో పెరుగుతున్న చైనా ప్రాబల్యాన్ని ఎదుర్కోవడానికి తమ దేశాల మధ్య సముద్ర సహకార సంబంధాలను మరింతగా పెంచుకోవడానికి ఏప్రిల్ 7, 2024న ఈ డ్రీల్‌ను నిర్వహిస్తామని ఆయా దేశాల రక్షణ చీఫ్‌లు శనివారం సంయుక్త ప్రకటనలో తెలిపారు. దీనికి "మారిటైమ్ కోఆపరేటివ్ యాక్టివిటీ" అని పేరు కూడా పెట్టారు. దీనిలో భాగంగా నాలుగు దేశాలకు చెందిన నావికా, వైమానిక దళాలు తమ విన్యాసాలను ప్రదర్శిస్తాయి. ఇది ఇండో-పసిఫిక్‌కు మద్దతుగా స్వేచ్ఛ అందించడానికి, ప్రాంతీయ, అంతర్జాతీయ సహకారాన్ని బలోపేతం చేయడానికి మిత్రదేశాల సమిష్టి నిబద్ధతను ప్రదర్శిస్తుందని ఒక అధికారి తెలిపారు.
అమెరికా ప్రెసిడెంట్ జో బైడెన్, ఫిలిప్పీన్స్, జపాన్ నాయకులతో మొదటి త్రైపాక్షిక శిఖరాగ్ర సమావేశాన్ని నిర్వహించడానికి కొద్ది రోజుల ముందు ఈ డ్రీల్‌ను నిర్వహించడం గమనార్హం. దక్షిణ చైనా సముద్రం ప్రపంచంలోనే అత్యంత రద్దీగా ఉండే జలమార్గాలలో ఒకటిగా పరిగణించబడుతుంది. ఇది వాణిజ్యం, వ్యాపారాల షిప్పింగ్‌కు ముఖ్యమైన మార్గం. అయితే గత కొంత కాలంగా ఈ ప్రాంతాన్ని చైనా తమది అని వాదిస్తుండగా, ఇప్పుడు ఈ ప్రదేశంలో నాలుగు దేశాలు నావికా విన్యాసాలను చేపట్టనున్నాయి.