National bird: అమెరికా జాతీయ పక్షిగా ‘బాల్డ్ ఈగల్’..యూఎస్ సెనేట్ ఆమోదం

by vinod kumar |
National bird: అమెరికా జాతీయ పక్షిగా ‘బాల్డ్ ఈగల్’..యూఎస్ సెనేట్ ఆమోదం
X

దిశ, నేషనల్ బ్యూరో: అమెరికా జాతీయ పక్షిగా ది బాల్డ్ ఈగల్‌ను ఖరారు చేశారు. ఈ మేరకు బిల్లుకు యూఎస్ సెనేట్ ఆమోదం తెలిపింది. సుమారు 200 ఏళ్లుగా దీనిని జాతీయ పక్షిగా పేర్కొంటున్నా అధికారికంగా మాత్రం ఇప్పటి వరకు గుర్తింపు రాలేదు. మిన్నెసోటా డెమొక్రాట్ అమీ క్లోబుచార్ ప్రవేశపెట్టిన బిల్లుకు ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. ‘240 ఏళ్లకు పైగా ది బాల్డ్ ఈగల్ అమెరికాకు ప్రతీకగా ఉంది. అయినప్పటికీ ఇది అధికారికంగా జాతీయ పక్షి కాదు’ అని బిల్లు ఆమోదించిన తర్వాత సెనేటర్ సింథియా లుమిస్ ఓ ప్రకటనలో తెలిపారు. తాజాగా ఆమోదం పొందిన బిల్లు త్వరలోనే చట్టంగా మారుతుందని ఆశిస్తున్నట్టు చెప్పారు. స్వేచ్ఛకు గుర్తుగా పక్షి స్థానాన్ని మరింత పటిష్టం చేస్తుందని తెలిపారు. కాగా, నేషనల్ పార్క్ సర్వీసెస్ ప్రకారం, బాల్డ్ ఈగల్ ప్రధానంగా యునైటెడ్ స్టేట్స్‌లో నివసిస్తుంది. అలాగే కొన్ని కెనడా, మెక్సికోలోనే సంచరిస్తాయి. అలస్కా, మిన్నెసోటాలో అత్యధిక సంఖ్యలో ఈ పక్షులు కనిపిస్తాయి.

Advertisement

Next Story